News August 6, 2024

WOW: నడిస్తే కరెంటు ఉత్పత్తి అయ్యే షూ

image

ఆర్మీ కోసం IIT ఇండోర్ స్పెషల్ షూ రూపొందించింది. TENG టెక్నాలజీ వల్ల నడుస్తుంటే విద్యుత్ ఉత్పత్తి జరిగి సోల్‌లోని ఒక డివైజులో స్టోర్ అవుతుంది. దీన్ని వాడుకోవచ్చు. GPSతో రియల్ టైమ్ లొకేషన్ గుర్తించొచ్చు. ఇవి భద్రతతో పాటు జవాన్ల మధ్య సమన్వయం పెంచుతాయి. ఇప్పటికే 10 జతలను DRDOకు పంపించారు. ఈ షూ వేసుకోవడం వల్ల అల్జీమర్స్‌ బాధితులు, విద్యార్థుల లొకేషన్ తెలుసుకోవచ్చు. ఆటగాళ్ల ప్రదర్శన మెరుగుపర్చుకోవచ్చు.

Similar News

News March 17, 2026

VZM: 22న బాడీ బిల్డర్స్ పోటీలు

image

యువత డ్రగ్స్, గంజాయి వంటి మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని జిల్లా బాడీ బిల్డర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు శంకరరావు పిలుపునిచ్చారు. పట్టణంలోని రాజీవ్ క్రీడా మైదానంలో మంగళవారం మాట్లాడారు. 22న గురజాడ కళాభారతిలో “మిస్టర్ VZM-2026” బాడీ బిల్డింగ్ పోటీలు నిర్వహిస్తున్నామన్నారు. 55 నుంచి 75 కేజీల వరకు 6 కేటగిరీల్లో పోటీలు జరగనున్నాయన్నారు. మత్తు పదార్థాలపై అవగాహన కల్పించేందుకే పోటీలు నిర్వహిస్తునమన్నారు.

News March 17, 2026

Stock Market: వరుసగా రెండో రోజూ లాభాలు

image

దేశీయ స్టాక్ మార్కెట్లు వరుసగా రెండో రోజూ లాభాల్లో క్లోజ్ అయ్యాయి. గ్యాస్, చమురు ట్యాంకర్లు భారత్‌కు చేరుతుండడం సెంటిమెంట్‌ను పెంచింది. కీలక రంగాల షేర్లు అట్రాక్టివ్ ప్రైస్‌కు తగ్గడంతో కొనుగోళ్ల కళ కనిపించింది. సెన్సెక్స్ 567 పాయింట్లు పెరిగి 76,070 వద్ద క్లోజైంది. నిఫ్టీ 172 పాయింట్లు ఎగబాకి 23,581 వద్ద స్థిరపడింది. ఎటర్నల్, టాటా స్టీల్, M&M, BEL షేర్లు లాభపడగా.. ఇన్ఫీ, ITC, TCS నష్టపోయాయి.

News March 17, 2026

‘ఉడుతా భక్తి’ అంటే ఏమిటి?

image

ఎలాంటి స్వార్థం లేకుండా తమ శక్తి మేరకు చేసే చిన్న సహాయం గురించి చెప్పే సందర్భంలో ‘ఉడుతా భక్తి’ జాతీయాన్ని వాడతారు. ఇది రామాయణం నుంచి పుట్టింది. లంకకు రామసేతు నిర్మాణంలో తాను కూడా భాగం కావాలని ఉడుత భావిస్తుంది. నీటిలో తడుస్తూ ఇసుకలో పొర్లాడుతూ ఆ ఇసుకను రాళ్ల మధ్య నింపే ప్రయత్నం చేస్తుంది. అందుకు రాముడు మెచ్చుకొని ఉడుత మీద నిమరడంతో ఏర్పడిన గీతలే ఇప్పటికీ ఉన్నాయని ఓ నమ్మకం.
<<-se>>#EPICSAYINGS<<>>