News July 30, 2024
WOW.. ఐఫోన్లోనూ కాల్ రికార్డింగ్ ఫీచర్!

ఆండ్రాయిడ్‌లో అందుబాటులో ఉన్న కాల్ రికార్డింగ్ ఆప్షన్ మరికొద్ది రోజుల్లో యాపిల్ యూజర్లు పొందనున్నట్లు టెక్ నిపుణులు చెబుతున్నారు. Apple iOS 18.1 వెర్షన్లో కాల్ రికార్డింగ్ ఆప్షన్ ఉంచారట. ప్రస్తుతం ఇది ఎంపిక చేసిన యూజర్లకు (డెవలపర్స్) మాత్రమే అందుబాటులో ఉంది. అయితే, రికార్డ్ చేస్తున్నట్లు కాలర్‌కు తెలియజేస్తుంది. దీంతోపాటు రికార్డయిన ఆడియోను టెక్స్ట్ రూపంలో మార్చే సదుపాయం కూడా ఉంటుందట.
Similar News
News December 25, 2025
95 పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం

<
News December 25, 2025
రష్యాలో క్రిస్మస్ ఎప్పుడో తెలుసా?

ప్రపంచమంతటా ఇవాళ క్రిస్మస్ జరుపుకుంటున్నారు. రష్యా మాత్రం జనవరి 7న సెలబ్రేట్ చేసుకుంటుంది. దీనికో ప్రత్యేక కారణం ఉంది. 1582లో యూరప్ దేశాలు గ్రెగోరియన్ క్యాలెండర్ అనుసరించడం ప్రారంభించాయి. కానీ రష్యా ఆర్థడాక్స్ చర్చ్ జులియన్ క్యాలెండర్‌ను ఫాలో కావడం కొనసాగించింది. ఏళ్లు గడిచే కొద్దీ ఈ క్యాలెండర్ల మధ్య గ్యాప్ వచ్చింది. దీంతో Jan 7(జులియన్ క్యాలెండర్లో Dec 25)న రష్యా క్రిస్మస్ జరుపుకుంటుంది.
News December 25, 2025
కోహ్లీ క్రేజ్.. VHT స్కోర్ కోసం 10 లక్షల సెర్చ్‌లు

కోహ్లీ, రోహిత్ లాంటి స్టార్లు ఆడుతున్న విజయ్ హజారే ట్రోఫీ ప్రత్యక్ష ప్రసారం లేకపోవడంతో అభిమానులు గూగుల్‌ను ఆశ్రయించారు. ముఖ్యంగా కోహ్లీ లైవ్ స్కోర్ తెలుసుకునేందుకు ఎక్కువ మంది ఆసక్తి చూపారు. 10 గంటల వ్యవధిలో ఢిల్లీ-ఆంధ్రా మ్యాచ్ అప్డేట్స్ కోసం 10 లక్షలకు పైగా సెర్చ్‌లు నమోదయ్యాయి. ఏకంగా 1,81,818 సార్లు రీఫ్రెష్ చేశారు. నిన్నటి మ్యాచ్‌లో కింగ్ 101 బంతుల్లో 131 రన్స్ చేసిన విషయం తెలిసిందే.


