News November 3, 2024

WOW.. ఒకే కుటుంబంలో ఐదుగురికి ప్రభుత్వ ఉద్యోగాలు

image

TG: ఈ కాలంలో ఇంట్లో ఒక్కరికి ప్రభుత్వం ఉద్యోగం రావడమే గొప్ప విషయంగా భావిస్తున్నారు. అలాంటిది సంగారెడ్డి(D)లోని ఓ కుటుంబంలో ఐదుగురు ప్రభుత్వ ఉద్యోగాలు సాధించారు. రాయికోడ్‌కు చెందిన రాఘవరెడ్డి, శోభమ్మ దంపతులకు నలుగురు కూతుర్లు, ఒక కుమారుడు ఉన్నారు. తల్లిదండ్రుల ప్రోత్సాహంతో కష్టపడి చదివి ముగ్గురు టీచర్, ఇద్దరు పంచాయతీ సెక్రటరీ ఉద్యోగాలు సాధించారు. కాగా తండ్రి రిటైర్ట్ పోస్ట్ మాస్టర్ కావడం గమనార్హం.

Similar News

News October 17, 2025

కార్పొరేట్ స్కూళ్ల తరహాలో సర్కార్ బడులు: CM

image

TG: ప్రభుత్వ పాఠశాలలను కార్పొరేట్ స్కూళ్ల తరహాలో తీర్చిదిద్దాలని అధికారులను CM రేవంత్ ఆదేశించారు. స్కూళ్లలో మెరుగైన వసతుల కల్పనకు ప్రణాళికలు సిద్ధం చేయాలన్నారు. ‘తొలి దశలో ORR లోపల ఉన్న కోర్ అర్బన్ రీజియన్‌పై దృష్టి పెట్టండి. సరైన సౌకర్యాలు లేని స్కూళ్లను దగ్గర్లోని ప్రభుత్వ స్థలాలకు తరలించండి. నర్సరీ నుంచి 4వ తరగతి వరకు నూతన స్కూల్స్‌ను పైలట్ ప్రాజెక్టుగా ప్రారంభించండి’ అని సూచించారు.

News October 17, 2025

ఫిట్‌మ్యాన్‌లా మారిన హిట్‌మ్యాన్

image

టీమ్ ఇండియా స్టార్ బ్యాటర్ రోహిత్ శర్మ పూర్తి ఫిట్‌నెస్‌తో ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్‌కు రెడీ అవుతున్నారు. తాజా ఫొటో షూట్‌లో రోహిత్ సన్నగా కనబడుతున్నారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో ఛాంపియన్స్ ట్రోఫీ ఫొటో షూట్‌లో లావుగా ఉన్న రోహిత్.. వర్కౌట్స్ చేసి సన్నబడ్డారు. గతంలో ఆస్ట్రేలియాపై వన్డేల్లో డబుల్ సెంచరీ సాధించిన హిట్‌మ్యాన్.. మళ్లీ అలాంటి ఫీట్ రిపీట్ చేయాలని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు.

News October 17, 2025

కాంగ్రెస్, MIM అన్ని హద్దులూ దాటాయి: బండి

image

TG: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్‌కు MIM మద్దతివ్వడంపై కేంద్రమంత్రి బండి సంజయ్ ఫైరయ్యారు. ‘కాంగ్రెస్, MIM సిగ్గులేని రాజకీయాలు చేస్తున్నాయి. BJP, MIM ఒక్కటేనని ప్రచారం చేసే రాహుల్ గాంధీ దీనిపై ఎందుకు మాట్లాడరు? కాంగ్రెస్ ఒవైసీ ఒడిలో కూర్చుంది. BJP ఒంటరిగా పోటీ చేస్తోంది. MIMకు పోటీ చేసే ధైర్యమే చేయలేదు. మీరేం చేసినా మేమే గెలుస్తాం. ప్రజలు ఓట్లతో జవాబిస్తారు’ అని ట్వీట్ చేశారు.