News August 11, 2024

WOW.. HYDలో ట్రాఫిక్ తగ్గించేందుకు కొత్త సిస్టం ఇదే!

image

HYDలో ట్రాఫిక్ తగ్గించేందుకు రహదారుల మధ్యలో.. లేదంటే ఇరువైపులా పర్సనల్ రాపిడ్ ట్రాన్సిట్ సిస్టం సర్వీస్ మార్గాలను ఏర్పాటు చేసేందుకు వీలుందని HMDA అధికారులు తెలిపారు. రాయదుర్గం మెట్రో స్టేషన్ నుంచి నాలెడ్జి సిటీ వరకు 17KM, రాయదుర్గం మెట్రో స్టేషన్ నుంచి ఆర్థిక జిల్లా వరకు 15KM, కాచిగూడ ఎంజీబీఎస్ జూపార్క్ ఎయిర్‌పోర్ట్ వరకు 20KM అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందన్నారు.

Similar News

News September 19, 2024

HYD: నిమ్స్ వైద్యులకు ఐసీఎంఆర్ గుర్తింపు

image

కొవిడ్ సమయంలో మూడు ఏళ్ల పాటు శ్రమించి వైద్య సేవలందించిన నిమ్స్ వైద్యులకు ప్రత్యేక గుర్తింపు దక్కింది. వైద్యుల సేవలను గుర్తిస్తూ ICMR ప్రశంసా పత్రాలను అందజేసింది. వీరిలో జనరల్ మెడిసిన్ విభాగానికి చెందిన ప్రొఫెసర్లు నవాల్ చంద్ర, YSN రాజు, సుబ్బలక్ష్మి, జమునా హుస్సేన్, మైక్రోబయాలజీ విభాగానికి చెందిన ఉమాబాల, తేజా, పద్మజా, MVLN రామ్మోహన్ ఉన్నారు.

News September 19, 2024

HYDలో ఇదీ పరిస్థితి..!

image

HYDలో గణేశ్ ఉత్సవాలు మొదలయ్యాక భారీగా వ్యర్థాల సేకరణ పెరిగిందని అధికారులు వెల్లడించారు. ఆగస్టులో సగటున 7,900 మెట్రిక్ టన్నుల వ్యర్థాలు వెలువడితే, చవితి రోజు 8337.96 మె.టన్నులు సేకరించినట్లు తెలిపారు. 11తేదీన 8810.10 మె.టన్నులు, 17న 8547.58 మె.టన్నులు సేకరించారు. కాగా మంగళ, బుధవారాల్లో పోగైనది సేకరిస్తున్నారు. ఇందులో అత్యధికంగా కలర్ పేపర్లు, పూజా వ్యర్థాలే ఉన్నట్టు తెలిపారు.

News September 19, 2024

HYD: హృదయవిదారకం.. ప్రాణం తీసిన ఆకలి!

image

హైదరాబాద్ శివారులో బుధవారం హృదయవిదారక ఘటన వెలుగుచూసింది. శంషాబాద్ మున్సిపాలిటీ పరిధి తొండుపల్ల మసీదు వద్ద గుర్తు తెలియని మృతదేహం లభ్యమైంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. యాచకుడిగా గుర్తించి మృతదేహాన్ని ఉస్మానియా హాస్పిటల్‌కు తరలించారు. అయితే, గత కొన్ని రోజులుగా ఆకలితో అలమటిస్తూ ఆ వృద్ధుడు చనిపోయినట్లు‌ తెలుస్తోంది. ఇది విన్న స్థానికులు చలించిపోయారు.