News May 12, 2024

WOW.. HYDలో సొరంగ మార్గం..!

image

HYDలో సొరంగ మార్గ నిర్మాణంపై ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. ఎన్నికల తర్వాత నిపుణులతో సాయిల్, రూట్ ఇన్వెస్టిగేషన్ జరుగనుంది. ITC కోహినూర్ నుంచి ఖాజాగూడ, నానక్‌రాంగూడ మీదుగా విప్రో సర్కిల్‌ వరకు.. ITC నుంచి JNTUH, ITC నుంచి జూబ్లీహిల్స్ రోడ్ నంబర్ 45, GVK మాల్ నుంచి నానల్‌నగర్ వరకు.. నాంపల్లి నుంచి చాంద్రాయణగుట్ట,చార్మినార్ నుంచి ఫలక్‌నుమా వరకు ఆయా మార్గాల్లో సాధ్యాసాధ్యాలను పరిశీలించాలని నిర్ణయించారు.

Similar News

News April 7, 2026

HYD: FREE కార్ డ్రైవింగ్ ట్రైనింగ్..!

image

ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో గ్రామీణ పురుషులకు SBI, RSETI ఆధ్వర్యంలో ఉచితంగా కార్ డ్రైవింగ్ శిక్షణ ఇస్తున్నట్లు ఆ సంస్థ చిలుకూరు డైరెక్టర్ ఎండీ అలీఖాన్ Way2Newsతో తెలిపారు. ఈ శిక్షణకు 19- 45లోపు వారు అర్హులన్నారు. SSC మెమో, రేషన్, ఆధార్‌కార్డు, కాస్ట్ సర్టిఫికెట్, 4 ఫొటోలతో నేటి నుంచి ఈనెల 19లోపు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. వివరాలకు 85001 65190లో సంప్రదించాలన్నారు. # SHAREIT

News April 7, 2026

HYD: 108లో EMT ఉద్యోగాల ఇంటర్వ్యూలు

image

EMRI(108) సంస్థలో EMT పోస్టుల భర్తీకి ఏప్రిల్ 8న(బుధవారం) ఇంటర్వ్యూలు నిర్వహిస్తారు. B.Sc(BZC), ANM, DMLT, MLT, GNM, MPHA అర్హతలున్న 30ఏళ్లలోపు అభ్యర్థులు హాజరుకావచ్చు. ఉ.10 నుంచి మ.3 గంటల వరకు కింగ్ కోఠి జిల్లా ఆస్పత్రి వద్ద ఉన్న 108 రీజినల్ ఆఫీస్‌లో ఇంటర్వ్యూలు జరుగుతాయి. అభ్యర్థులు ఒరిజినల్ సర్టిఫికెట్లు, జిరాక్స్ కాపీలతో రావాలి. మరిన్ని వివరాలకు 9154248904కు ఫోన్ చేయవచ్చు. SHARE IT.

News April 7, 2026

HYD: అలర్ట్.. నల్లాలకు మోటార్లు.. రూ.5,000 FINE..!

image

నల్లాలకు మోటార్లు బిగించి లో-ప్రెజర్ వాటర్ సప్లైకి కారణమవుతున్న వారిపట్ల HMWSSB సీరియస్‌గా ఉంది. అలా చేసేవారికి రూ.5000 FINEతోపాటు మోటార్‌ను సీజ్ చేస్తామని MD అశోక్ రెడ్డి తెలిపారు. అందరికీ సమపాళ్లలో నీళ్లందాలనే ఈ చర్యలు ప్రారంభించనున్నట్లు చెప్పారు. వేసవి ముగిసేవరకు లైన్‌మెన్ నుంచి MD పర్యవేక్షణలో ఈ ఆకస్మిక తనిఖీలు ఉంటాయన్నారు. నగరంలో ఇలా 40శాతం నల్లాలకు మోటార్లు ఫిక్స్ చేస్తున్నట్లు గుర్తించారు.