News October 29, 2024
పేరులోనే ‘వావ్’.. చూస్తే షాక్

TG: మోమోస్ తిని మహిళ <<14473401>>మృతి<<>> చెందిన ఘటనపై GHMC దర్యాప్తు చేపట్టింది. చింతల్‌బస్తీలోని ‘వావ్ హాట్ మోమోస్’ షాపులో వాటిని తయారుచేసినట్లు గుర్తించి తనిఖీలు చేపట్టింది. అయితే అక్కడి పరిసరాలు చూసి అధికారులు షాక్ అయ్యారు. ఏ మాత్రం పరిశుభ్రత లేని ప్రదేశంలో మోమోస్ తయారు చేస్తున్నట్లు గుర్తించారు. దీంతో టెస్టుల కోసం ఫుడ్ శాంపిల్స్‌ను ల్యాబ్‌కు పంపించారు.
Similar News
News December 6, 2025
US అగ్నిప్రమాదం.. మృతులు హైదరాబాదీలే!

అమెరికాలో అగ్నిప్రమాద <<18481815>>ఘటనలో<<>> మరణించిన ఇద్దరు హైదరాబాదీలేనని తెలుస్తోంది. HYD జోడిమెట్ల సమీపంలోని శ్రీనివాసకాలనీలో నివాసముండే సహజారెడ్డి(24) ఉన్నత విద్య కోసం నాలుగేళ్ల క్రితమే USకు వెళ్లింది. నిన్న ప్రమాదంలో మరణించిందని అధికారులు చెప్పడంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరయ్యారు. ఆమె తండ్రి సాఫ్ట్వేర్ ఉద్యోగి కాగా తల్లి ప్రభుత్వ ఉద్యోగి. మరో విద్యార్థి కూకట్ పల్లికి చెందిన వ్యక్తి అని సమాచారం.
News December 6, 2025
చెలరేగిన ప్రసిద్ధ్.. ఒకే ఓవర్లో 2 వికెట్లు

SAతో ODI సిరీస్‌లో పేలవ బౌలింగ్‌తో విమర్శలు ఎదుర్కొంటున్న IND బౌలర్ ప్రసిద్ధ్ కృష్ణ ఎట్టకేలకు రిథమ్ అందుకున్నారు. విశాఖలో జరుగుతున్న 3వ ODIలో ఫస్ట్ 2ఓవర్లలో 27రన్స్ సమర్పించుకున్న ఆయన.. తన సెకండ్ స్పెల్‌లో ఒకే ఓవర్లో బ్రిట్జ్కే, మార్క్రమ్ను, అనంతరం డికాక్(106)ను క్లీన్‌బౌల్డ్ చేశారు. ప్రస్తుతం 7 ఓవర్లలో 52 పరుగులిచ్చి వికెట్లు పడగొట్టారు. అటు కుల్దీప్ సైతం ఒకే ఓవర్లో 2 వికెట్లు తీశారు.
News December 6, 2025
ఇండిగో CEOపై చర్యలు, భారీ ఫైన్?

విమాన కార్యకలాపాల నిర్వహణలో ఫెయిలైన ఇండిగో CEO పీటర్ ఎల్బర్స్‌ను సస్పెండ్ చేసే ఆలోచనలో విమానయాన శాఖ ఉందని తెలుస్తోంది. వేల మంది ప్రయాణికులను ఇబ్బంది పెట్టిన సంస్థకు భారీ జరిమానా విధించడంతోపాటు ఇండిగో సర్వీసులను తగ్గించాలని ఆదేశించే అవకాశం ఉన్నట్టు సమాచారం. FDTL అమలులో నిర్లక్ష్యమే ప్రస్తుత సంక్షోభానికి కారణమని కేంద్రం భావిస్తోంది. కాగా, ఆ రూల్‌ను తాత్కాలికంగా నిలిపివేసింది.


