News January 24, 2025
WOW: నేతాజీ ఆకారంలో రూట్ మ్యాప్.. 913km సైకిల్ తొక్కి..

స్వాతంత్ర్య సమరయోధుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతి సందర్భంగా ఆయనకు హైదరాబాద్‌కు చెందిన ఓ సైక్లిస్ట్ వినూత్నంగా నివాళులర్పించారు. రిటైర్డ్ ఆర్మీ జవాన్ అయిన సైక్లిస్ట్ అనిల్ కుమార్ బోస్ ఆకారంలో రూట్ మ్యాప్ గీసుకొని నగరంలో 11 రోజుల పాటు 913KMS తొక్కారు. నగరంలోని AOC సెంటర్లో ఆరంభించి ఫాక్స్ సాగర్ దగ్గర ముగించారు. తాను బోస్‌కు వీరాభిమాని కావడం వల్లే ఇలా చేసినట్లు అనిల్ తెలిపారు.
Similar News
News December 11, 2025
పదేళ్ల తర్వాత జాతీయ స్థాయి పోటీలు: రాంప్రసాద్ రెడ్డి

AP: రాష్ట్రంలో పదేళ్ల తర్వాత జాతీయ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ నిర్వహిస్తున్నట్లు మంత్రి రాంప్రసాద్ రెడ్డి తెలిపారు. యోనెక్స్-సన్‌రైజ్ 87వ జాతీయ పోటీల పోస్టర్‌ను CM చంద్రబాబు ఆవిష్కరించగా ఆయన్ను ప్రారంభోత్సవానికి మంత్రి ఆహ్వానించారు. DEC 24-28వ తేదీ వరకు పోటీలు జరుగుతాయన్నారు. టోర్నమెంట్ విజయవంతంగా నిర్వహించేందుకు క్రీడా శాఖ, మున్సిపాలిటీ, శాప్ విభాగాలు ఏర్పాట్లు చేస్తున్నాయని CMకు వివరించారు.
News December 11, 2025
సీనియారిటీ, సిన్సియారిటీకే ప్రాధాన్యమిచ్చాం: పవన్

AP: గతంలో ఎన్నడూ లేని విధంగా 10వేల మందికి పైగా పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ఉద్యోగులకు పదోన్నతులు కల్పించామని Dy.CM పవన్ అన్నారు. ‘ప్రమోషన్ల ఆనందం ప్రజలకు అందించే సేవల్లో కనబడాలి. నిష్పక్షపాతంగా, నిబద్ధతతో వ్యవహరించాలి. గత ప్రభుత్వంలో పోస్టింగ్, ప్రమోషన్‌కు ఓ రేటు కార్డు ఉండేది. కూటమి పాలనలో సీనియారిటీ, సిన్సియారిటీకే ప్రాధాన్యమిచ్చాం’ అని ఉద్యోగులతో మాటా-మంతి కార్యక్రమంలో ఆయన అన్నారు.
News December 11, 2025
నేడే రెండో T20.. మ్యాజిక్ కొనసాగిస్తారా?

IND-SA మధ్య 5 T20ల సిరీస్‌లో భాగంగా ఇవాళ ముల్లాన్‌పూర్ వేదికగా రెండో మ్యాచ్ జరగనుంది. తొలి T20లో IND 101 రన్స్ తేడాతో గెలిచిన విషయం తెలిసిందే. ఇవాళ్టి మ్యాచ్‌లోనూ అదే జోరు కొనసాగించాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. బౌలింగ్‌లో మెప్పించిన భారత్ బ్యాటింగ్‌లో కాస్త కంగారు పెట్టింది. హార్దిక్ మినహా ఎవరూ పెద్దగా రాణించలేదు. అందుకే బ్యాటింగ్‌పై మరింత దృష్టి సారించాలన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.


