News July 9, 2024
వామ్మో.. కేవలం ఇద్దరు సింగర్లకే రూ.141కోట్లు ఖర్చు?

ముకేశ్ అంబానీ కుమారుడు అనంత్ అంబానీ-రాధికా వివాహ వేడుక గ్రాండ్‌గా జరుగుతోంది. వెడ్డింగ్ సెలబ్రేషన్స్‌లో పర్ఫార్మెన్స్ ఇచ్చిన పాప్ సింగర్ జస్టిన్ బీబర్‌కు రూ.83కోట్లు చెల్లించినట్టు తెలుస్తోంది. ఎంగేజ్మెంట్లో లేడీ సింగర్ రిహన్నాకు రూ.58కోట్లు ఇచ్చినట్లు వార్తలు వచ్చాయి. అంటే కేవలం ఈ ఇద్దరు సింగర్లకే రూ.141కోట్లు ఖర్చు చేశారన్నమాట. వీరితో పాటు మరికొందరు పాప్ సింగర్స్ కూడా ఈ వేడుకల్లో పాల్గొన్నారు.
Similar News
News January 21, 2026
అసలు ఏమిటీ ‘నైనీ కోల్ బ్లాక్’ వివాదం? 1/2

TGలో నైనీ కోల్ బ్లాక్ వివాదం పెనుదుమారం రేపుతోంది. ఒడిశాలోని నైనీలో ఉన్న బొగ్గు గనిని గతంలో కేంద్రం సింగరేణికి కేటాయించింది. తవ్వకాలకు సింగరేణి నోటిఫికేషన్ ఇచ్చింది. అందుకు ఈ నెల 29 వరకు గడువు విధించింది. అయితే నోటిఫికేషన్లో 1.8 నిబంధన ప్రకారం గని తవ్వాల్సిన ప్రాంతాన్ని సందర్శించి, అన్ని వివరాలు తెలుసుకున్నట్లు GM నుంచి తీసుకున్న ధ్రువపత్రాన్ని జత చేయాలని తెలిపింది. ఇక్కడే అసలైన వివాదం మొదలైంది.
News January 21, 2026
అసలు ఏమిటీ ‘నైనీ కోల్ బ్లాక్’ వివాదం? 2/2

TG: సింగరేణి నిబంధన ప్రకారం తాము నైనీ కోల్ బ్లాక్‌ను సందర్శించినా GM సర్టిఫికెట్ ఇవ్వలేదని, దీంతో టెండర్లలో పాల్గొనలేకపోతున్నామని కొన్ని కంపెనీలు ఆరోపించాయి. పలువురు మంత్రులు తమ వారికే టెండర్ ఇప్పించుకోవాలని చూస్తున్నారన్న ఆరోపణలూ గుప్పుమన్నాయి. దీంతో వివాదం ముదరడంతో Dy.CM భట్టి టెండర్ నోటిఫికేషన్ రద్దు చేశారు. ఇంతలో గొడవలోకి ఎంటరైన కేంద్రం ఇలా అయితే సింగరేణిని తామే నిర్వహిస్తామంటూ హెచ్చరించింది.
News January 21, 2026
ఆరోగ్యంగా ఉండాలంటే ఈ అలవాట్లు తప్పనిసరి!

సరైన జీవనశైలితో అనారోగ్యాన్ని 90శాతం వరకూ దూరం చేసుకోవచ్చని వైద్యులు సూచిస్తున్నారు. వారానికి 3-4 సార్లు వ్యాయామం, ప్రతిరోజూ 10 వేల అడుగుల నడక గుండెను ఆరోగ్యంగా ఉంచుతాయని తెలిపారు. ‘సరైన సమయానికి నిద్రపోవడం, ఉదయాన్నే ఎండలో నిలబడటం వల్ల శరీరానికి కావాల్సిన శక్తి అందుతుంది. పోషకాహారం తీసుకోవడం, రోజుకు 3 లీటర్ల నీరు తాగడం ముఖ్యం. ధ్యానం చేయడం వల్ల ఒత్తిడి తగ్గుతుంది’ అని చెబుతున్నారు. share it


