News April 11, 2024

వావ్.. ఇది కదా దేశానికి కావాల్సింది!

image

కేరళ ప్రజలు మత సామరస్యాన్ని చాటారు. ముస్లింలు అధికంగా ఉండే ముత్తువల్లూర్ గ్రామంలో 400ఏళ్ల నాటి దుర్గాభగవతి ఆలయం ఉంది. అయితే ముస్లింలు, హిందువులు కలిసి ఈ ఆలయాన్ని పునరుద్ధరించారు. ఆర్థిక సాయంతో ఆగిపోకుండా నిర్మాణ సామగ్రిని విరాళంగా ఇచ్చారు. అలా ఇరు వర్గాల ప్రజలు కలిసి ఆలయాన్ని పునరుద్ధరించారు. మేలో విగ్రహ ప్రతిష్ఠాపన జరగనుంది. హిందూ పండుగలకు క్రమం తప్పకుండా కూరగాయలు ఇస్తుండటం మరో విశేషం.

Similar News

News November 15, 2024

భారత ఆర్థిక వ్యవస్థ భేష్: మూడీస్

image

భారత ఆర్థిక వ్యవస్థ వృద్ధిని మూడీస్ సంస్థ ప్రశంసించింది. 2024 ఆర్థిక సంవత్సరంలో దేశం 7.2 వృద్ధి నమోదు చేస్తుందని అంచనా వేసింది. 2025లో 6.6 శాతం, 2026లో 6.5శాతం వృద్ధి ఉంటుందని పేర్కొంది. ఆర్థికంగా దేశం చక్కటి దశలో ఉందని అభిప్రాయపడింది. అయితే, ప్రపంచ రాజకీయ పరిస్థితులు, వాతావరణ ఇబ్బందులు వెరసి మాంద్యం భయాల కారణంగా RBI కఠినతరమైన విధానాల్నే కొనసాగించొచ్చని అంచనా వేసింది.

News November 15, 2024

దీపావళి విందులో మద్యం, మాంసం: క్షమాపణ చెప్పిన బ్రిటన్ ప్రధాని ఆఫీస్

image

దీపావళి వేడుకల్లో <<14574659>>మద్యం, మాంసం<<>> వడ్డించడంపై బ్రిటన్ ప్రధాని కీర్ స్టార్మర్ ఆఫీస్ క్షమాపణ చెప్పింది. పొరపాటు జరిగిందని మరోసారి ఇలా కాకుండా చూస్తామంది. కొన్నేళ్లుగా UK PM దీపావళి వేడుకలకు ఆతిథ్యమివ్వడం ఆనవాయితీగా వస్తోంది. భారతీయ నృత్య ప్రదర్శనలు, దీపాలు వెలిగించడం, ఇతర కార్యక్రమాల తర్వాత వెజిటేరియన్ విందు ఉంటుంది. ఈసారి మద్యం, మాంసం వడ్డించడంతో విమర్శలొచ్చాయి. దీనిపై పీఎం ఆఫీస్ స్పందించింది.

News November 15, 2024

హీరో విడాకుల కేసు.. కోర్టు ఏమందంటే?

image

హీరో జయం రవి, ఆర్తి విడాకుల కేసుపై చెన్నై కోర్టులో విచారణ జరిగింది. రవి నేరుగా కోర్టుకు రాగా ఆర్తి వర్చువల్‌గా హాజరయ్యారు. ఇరువురి లాయర్ల వాదనలు విన్న న్యాయస్థానం మరోసారి ఇద్దరూ కలిసి మాట్లాడుకోవాలని చెప్పింది. రాజీ కుదుర్చుకోవడానికి ప్రయత్నించాలని సూచించింది. విడిపోవడమే సబబు అనుకుంటే కచ్చితమైన కారణాన్ని తెలియజేయాలని పేర్కొంది. కాగా 2009లో పెళ్లి చేసుకున్న రవి, ఆర్తికి ఇద్దరు పిల్లలున్నారు.