News March 14, 2025
WOW.. గ్రూప్స్‌లో సత్తాచాటిన సిద్దిపేట బ్రదర్స్

సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలం గుగ్గిళ్ల గ్రామానికి చెందిన సీత లక్ష్మి, కొమురయ్య దంపతుల కొడుకులు వెంకటేశ్, హరికృష్ణలు ఇటీవల విడుదలైన గ్రూప్-1, గ్రూప్-2 ఫలితాల్లో సత్తా చాటారు. పెద్ద కుమారుడు వెంకటేశ్ గ్రూప్ -1లో 466 మార్కులు సాధించారు. ర్యాంక్స్ వెల్లడించాల్సి ఉండగా ప్రస్తుతం ఆయన పాల్వంచ కొత్తగూడెం థర్మల్ పవర్ జెన్కో ఏఈగా పనిచేస్తున్నాడు. చిన్నోడు హరికృష్ణ గ్రూప్-2లో 184 ర్యాంక్ సాధించారు.
Similar News
News March 14, 2025
టాటా కమ్యూనికేషన్స్ ఛైర్మన్‌గా గణపతి సుబ్రహ్మణ్యం

తమ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ ఛైర్మన్‌గా టాటా సంస్థ గణపతి సుబ్రహ్మణ్యాన్ని నియమించింది. నామినేషన్-రెమ్యునరేషన్ కమిటీ సూచనల మేరకు ఈ నిర్ణయాన్ని తీసుకుంది. ఆయన 2021లో బోర్డులో నాన్-ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా చేరారు. టీసీఎస్‌లో ఆయన గత 40 ఏళ్లుగా సేవలందించారు. ఆ సంస్థకు సీఓఓగా పనిచేసి గత ఏడాది మేలో పదవీవిరమణ చేశారు.
News March 14, 2025
శ్రీకాకుళం జిల్లా మీదుగా ప్రత్యేక రైళ్లు

ప్రయాణికుల సౌకర్యార్ధం శ్రీకాకుళం, పలాస మీదుగా షాలిమార్(SHM), విశాఖపట్నం(VSKP) మధ్య ప్రత్యేక రైళ్లు నడపనున్నట్లు రైల్వే శాఖ అధికారులు శుక్రవారం తెలిపారు. ఈ మేరకు ఈ నెల 16న VSKP- SHM(నం.08577), 17న SHM- VSKP(నం.08578) మధ్య ప్రత్యేక రైళ్లు నడుపుతున్నామన్నారు. ఈ రైళ్లు పలాస, శ్రీకాకుళం రోడ్‌తో పాటు విజయనగరం, కొత్తవలస, చీపురుపల్లితో పాటు పలు ప్రధాన స్టేషన్లలో ఆగుతాయని ఓ ప్రకటన విడుదల చేశారు.
News March 14, 2025
ఫ్యామిలీతో కలిసి రోహిత్ శర్మ మాల్దీవుల విహారం

టీమ్ ఇండియాకు ఛాంపియన్స్ ట్రోఫీ తెచ్చిపెట్టిన కెప్టెన్ రోహిత్ శర్మ ఆ టోర్నీ అనంతరం ఫ్యామిలీతో కలిసి విహారయాత్రలో గడుపుతున్నారు. భార్యాబిడ్డలతో కలిసి మాల్దీవులకు వెళ్లారు. దానికి సంబంధించి ఆయన ఇన్‌స్టాలో పెట్టిన పోస్ట్ వైరల్ అవుతోంది. వచ్చే 2 నెలల పాటు ఐపీఎల్‌తో తీరిక లేని షెడ్యూల్‌లో ఉండనున్న నేపథ్యంలో ఆయన ఈ బ్రేక్ తీసుకున్నట్లు తెలుస్తోంది. రెండు మూడురోజుల్లో ఆయన ముంబై జట్టుతో కలవనున్నారు.