News November 18, 2024

WOW.. భద్రాచలంలోని అద్భుతమైన దృశ్యం

image

భద్రాచలంలోని రాముడి ఆలయం వద్ద అద్భుతమైన డ్రోన్ దృశ్యం కనువిందు చేస్తోంది. ఓ వైపు భద్రాద్రి రాముడి ఆలయం, మరోవైపు గోదావరినది, మబ్బుల చాటు సూర్యుడు చూపరులను ఆకట్టుకుంటోంది. కాగా కార్తీకమాసాన్ని పురష్కరించుకుని భక్తులు పవిత్ర గోదావరి నది వద్ద స్నానాలు ఆచరించి ప్రత్యేక పూజలు నిర్వహించి నదీలో దీపాలు వదులుతున్నారు. PC: Sanjay chowdary

Similar News

News December 27, 2024

ఆశ వర్కర్ల సమస్యలను పరిష్కరించాలి: తమ్మినేని

image

ఆశ వర్కర్ల సమస్యలను పరిష్కరిస్తామని ఎన్నికల్లో హామీ ఇచ్చి, ఇప్పుడు ఆ హామీని అమలు చేయకపోవడం సరికాదని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. ఆశ వర్కర్లు చేపట్టిన బస్సు యాత్ర ఖమ్మంకు చేరుకున్న నేపథ్యంలో వారికి తమ్మినేని సంఘీభావం తెలిపారు. ఆశా వర్కర్లకు ఇచ్చిన ప్రతి ఒక్క హామీని ప్రభుత్వం నెరవేర్చాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఆశాల సమస్యల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందన్నారు.

News December 26, 2024

సీఎం కప్-2024 రాష్ట్రస్థాయి పోటీలకు సర్వం సిద్ధం

image

ఖమ్మం: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న సీఎం కప్ 2024 రాష్ట్రస్థాయి పోటీలకు రంగం సిద్ధమవుతోంది. ఈ పోటీలు గ్రామస్థాయి, మండల స్థాయి, జిల్లా స్థాయి పోటీలు పూర్తిచేసుకుని, డిసెంబర్ 27 నుంచి జనవరి 2 వరకు రాష్ట్రస్థాయి పోటీలు జరగనున్నాయి. కాగా ఖమ్మం జిల్లా నుంచి 24 క్రీడాంశాల్లో 422 మంది క్రీడాకారులు రాష్ట్ర స్థాయి పోటీలకు అర్హత పొంది, పోటీల్లో పాల్గొననున్నారు.

News December 26, 2024

కన్నుల పండుగగా రాములోరి నిత్య కళ్యాణం

image

భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామివారి దేవస్థానంలో గురువారం స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉదయం 4 గంటలకే అర్చకులు ఆలయ తలుపులు తెరిచి స్వామివారికి సుప్రభాత సేవ నిర్వహించారు. అనంతరం ఆరాధన, సేవాకాలం, నిత్య బలిహరణం, పవిత్ర గోదావరి జలంతో అభిషేకం తదితర నిత్య పూజా కార్యక్రమాలు యథావిధిగా జరిపారు. అనంతరం రామయ్య నిత్యకల్యాణాన్ని వైభవంగా నిర్వహించారు.