News January 28, 2026
WPL: ఒకే ఓవర్లో 4, 4, 4, 4, 1, 6

IPL తరహాలో WPLలో బ్యాటర్లు బౌండరీల వర్షం కురిపిస్తున్నారు. నిన్న గుజరాత్‌తో మ్యాచులో ఢిల్లీ బ్యాటర్లు నికీ ప్రసాద్(9 ఫోర్లు), స్నేహ్ రాణా(3 ఫోర్లు, 2 సిక్సులు) చెలరేగారు. 17వ ఓవర్లో తొలి 4 బంతుల్లో నికీ ఫోర్లు బాదగా, చివరి బంతిని రాణా సిక్సర్‌గా మలిచారు. 19వ ఓవర్లో రాణా తొలి 3 బంతుల్లో 6, 4, 4 బాదారు. ఐదో బంతిని నికీ ఫోర్ కొట్టారు. కానీ చివరి ఓవర్లో తడబడి <<18979077>>మ్యాచును<<>> చేజార్చుకున్నారు.
Similar News
News January 28, 2026
మేడారం జాతరలో బెల్లమే బంగారం.. ఎందుకంటే?

TG: ఆసియాలోనే అతిపెద్ద గిరిజన పండుగగా పేరొందిన మేడారం మహాజాతర నేటి నుంచి ప్రారంభమైంది. ఈ జాతరలో భక్తులు అమ్మవార్లకు ఇచ్చే ప్రధాన కానుక బెల్లం. గిరిజన సంప్రదాయంలో బెల్లాన్ని ప్రకృతి ప్రసాదంగా భావిస్తారు. బంగారంతో సమానంగా చూస్తారు. అందుకే ‘నిలువెత్తు బంగారం’ అంటారు. కోరికలు తీరితే తమ బరువుకు సమానంగా తులాభారం వేసి సమర్పిస్తారు. గద్దెల వద్ద బెల్లం ముక్కలను నైవేద్యంగా పెట్టి ప్రసాదంగా తీసుకుంటారు.
News January 28, 2026
వాడియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హిమాలయన్ జియాలజీలో ఉద్యోగాలు

<
News January 28, 2026
చివరి కోరిక తీరకుండానే తిరిగిరాని లోకాలకు

మహారాష్ట్ర రాజకీయాల్లో దశాబ్దాలుగా కీలక పాత్ర పోషించిన అజిత్ పవార్‌కు ముఖ్యమంత్రి కావాలన్న ఆశ నెరవేరలేదు. ‘సీఎం కావాలనుకుంటున్నాను’ అని ఆయన పలు సందర్భాల్లో బహిరంగంగానే చెప్పారు. ఎన్నో రాజకీయ ఎత్తుగడలు వేసినా సీఎం కుర్చీ మాత్రం అజిత్ దాదాకు అందని ద్రాక్షగానే మిగిలింది. అయితే మహారాష్ట్ర చరిత్రలో అత్యధిక కాలం డిప్యూటీ సీఎంగా పనిచేసిన నేతగా <<18980541>>రికార్డు<<>> సృష్టించారు.


