News February 22, 2025

WPL: ఆర్సీబీపై ముంబై గెలుపు

image

WPLలో ఆర్సీబీ, ముంబై మధ్య జరిగిన తాజా మ్యాచ్‌లో ముంబై గెలుపొందింది. తొలుత బ్యాటింగ్ చేసిన RCB పెర్రీ(81, 43 బంతుల్లో) చెలరేగడంతో 167 రన్స్ చేసింది. ఛేజింగ్‌లో బ్యాటర్లు హర్మన్‌ప్రీత్(50, 38 బంతుల్లో), సివర్ బ్రంట్(42, 21 బంతుల్లో) మెరుపులతో మరో బంతి మిగిలుండగానే ముంబై లక్ష్యాన్ని ఛేదించింది.

Similar News

News February 22, 2025

కాంగ్రెస్‌లోనే కోనేరు కోనప్ప!

image

TG: కాంగ్రెస్ పార్టీకి రాజీనామాపై సిర్పూర్ మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప వెనక్కితగ్గారు. కోనప్పను సీఎం రేవంత్ రెడ్డి పిలిచి చర్చించి పలు హామీలు ఇవ్వడంతో నిర్ణయం వెనక్కి తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ భేటీలో సీఎంతో పాటు మాజీ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి ఉన్నారు. అయితే నిన్న కాంగ్రెస్‌ను వీడుతున్నట్లు ప్రకటించిన కోనప్ప గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రసన్నహరికృష్ణ(BSP)కు మద్దతు ఇస్తున్నట్లు తెలిపారు.

News February 22, 2025

OCల సంఖ్యను కేసీఆర్ ఎక్కువగా చూపారు: సీఎం రేవంత్

image

TG: కేసీఆర్ పాలనలో రాష్ట్రంలో ఓసీల సంఖ్యను ఎక్కువగా చూపారని సీఎం రేవంత్ ఆరోపించారు. కేసీఆర్ సర్వేలో 21 శాతం ఓసీలు ఉంటే తమ సర్వేలో 17 శాతమే ఉన్నట్టు తేలిందన్నారు. ప్రజాభవన్‌లో సీఎం మాట్లాడారు. ‘కేసీఆర్, కేటీఆర్, హరీశ్ ఎందుకు సర్వేలో పాల్గొనలేదు. మేం ముస్లింలను బీసీల్లో కలిపితే బండి సంజయ్ ఎలా ప్రశ్నిస్తారు. గుజరాత్‌లో 70 ముస్లిం కులాలను బీసీల్లో చేర్చింది కనబడలేదా?’ అని సీఎం ఫైర్ అయ్యారు.

News February 22, 2025

అభిమానులకు ఇంట్రెస్టింగ్ టాస్క్ ఇచ్చిన నటుడు

image

తెలుగు చిత్ర పరిశ్రమలోని విలక్షణ నటుల్లో ఒకరైన జగపతి బాబు సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ ఫ్యాన్స్‌తో ఇంటరాక్ట్ అవుతుంటారు. తాజాగా ఓ బ్లాక్ అండ్ వైట్ ఫొటోను షేర్ చేస్తూ ‘నేను ఎక్కడ ఉన్నానో చెప్పండి చూద్దాం’ అని ట్వీట్ చేశారు. ఇది పాఠశాల విద్యాభ్యాసం సమయంలో తోటి విద్యార్థులతో కలిసి ఏదో టూర్‌కు వెళ్లిన ఫొటోలా కనిపిస్తోంది. ఇంతకీ ఈ ఫొటోలో జగపతి బాబు ఎక్కడున్నారో కామెంట్ చేయండి.

error: Content is protected !!