News January 17, 2026

WPL: RCB హ్యాట్రిక్ విజయం

image

WPLలో ఆర్సీబీ వరుసగా మూడో విజయాన్ని అందుకుంది. గుజరాత్‌తో జరిగిన మ్యాచ్‌లో టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన బెంగళూరు 20 ఓవర్లలో 7 వికెట్లకు 182 పరుగులు చేసింది. టాప్‌ ఆర్డర్‌ తడబడినా రాధా యాదవ్‌ 66 పరుగులతో జట్టును నిలబెట్టారు. రిచా ఘోష్‌ 44 పరుగులతో మద్దతు ఇవ్వగా, చివర్లో క్లర్క్‌ మెరుపు ఇన్నింగ్స్‌ ఆడారు. ఛేజింగ్‌లో గుజరాత్‌ 150 పరుగులకు పరిమితమైంది. శ్రేయాంక పాటిల్ 5 వికెట్లు తీశారు.

Similar News

News February 18, 2026

PPP మోడల్‌లో వంద పడకల ఆస్పత్రులు: మంత్రి సత్యకుమార్‌

image

AP: ప్రతి ఒక్కరి ప్రాణం విలువైనదని భావించే కూటమి ప్రభుత్వం వైద్యారోగ్య రంగంలో విప్లవాత్మక మార్పులు తెస్తోందని మంత్రి సత్యకుమార్ అసెంబ్లీలో ప్రకటించారు. ఆళ్లగడ్డ, కొవ్వూరు వంటి ప్రాంతాల్లో ఆస్పత్రుల సామర్థ్యం పెంచాలన్న సభ్యుల విజ్ఞప్తిపై స్పందిస్తూ.. 50 పడకల కన్నా తక్కువ సౌకర్యాలున్న 61 నియోజకవర్గాలను గుర్తించామన్నారు. మొదట PPP మోడల్‌లో అక్కడ 100 పడకల మల్టీస్పెషాలిటీ ఆస్పత్రులను నిర్మిస్తామన్నారు.

News February 18, 2026

చంద్రబాబు వదిలిపెట్టరనే భయంతోనే ఆత్మహత్యలు: TDP

image

AP: మదనపల్లెలో చిన్నారిపై అఘాయిత్యానికి పాల్పడిన నిందితుడు కులవర్ధన్ చెరువులో దూకి ఆత్మహత్య చేసుకోవడం తెలిసిందే. ఈ నేపథ్యంలో SMలో TDP ఆసక్తికర పోస్ట్ పెట్టింది. 2018 దాచేపల్లి నుంచి నేటి మదనపల్లె ఘటన వరకు ఆడబిడ్డల జోలికి వెళ్లిన నిందితులు వరుసగా ఆత్మహత్యలు చేసుకున్నారని పేర్కొంది. నేరం చేస్తే చంద్రబాబు వదిలిపెట్టరనే భయమే వారిని వెంటాడిందని, అందుకే ప్రాణాలు తీసుకున్నారని రాసుకొచ్చింది.

News February 18, 2026

T20 ర్యాంకింగ్స్.. టాప్-10లోకి ఇషాన్

image

ఐసీసీ ప్రకటించిన తాజా టీ20 బ్యాటర్ల ర్యాంకింగ్స్‌లో టీమ్ఇండియా నుంచి నలుగురు బ్యాటర్లు టాప్-10లో ఉన్నారు. నంబర్ 1 స్థానంలో అభిషేక్ శర్మ కొనసాగుతుండగా తిలక్ 4, సూర్య 6, ఇషాన్ కిషన్ 8వ స్థానాల్లో నిలిచారు. టీ20 WCలో వరుసగా రెండు హాఫ్ సెంచరీలు చేయడంతో ఇషాన్ ర్యాంకింగ్ మెరుగుపడింది. టీ20 ఆల్‌రౌండర్లలో హార్దిక్ 3, దూబే 9వ స్థానంలో, బౌలర్లలో వరుణ్ చక్రవర్తి తొలి స్థానంలో ఉన్నారు.