News December 30, 2025

WPL: RCB నుంచి పెర్రీ ఔట్

image

JAN 9 నుంచి మొదలయ్యే WPLకు ముందు RCBకి షాక్ తగిలింది. ఆ జట్టు స్టార్ ప్లేయర్ ఎల్లీస్ పెర్రీ సీజన్‌కు దూరమయ్యారు. వ్యక్తిగత కారణాలతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆమె తెలిపారు. పెర్రీ ప్లేస్‌లో IND ఆల్‌రౌండర్ సయాలీ సత్‌ఘరే‌ను తీసుకున్నట్లు RCB తెలిపింది. 2024లో బెంగళూరు టైటిల్ సాధించడంలో పెర్రీ కీ రోల్ పోషించారు. అటు అన్నాబెల్ సదర్లాండ్(ఢిల్లీ), తారా నోరీస్(యూపీ వారియర్స్) కూడా WPLకు దూరమయ్యారు.

Similar News

News December 30, 2025

తెలంగాణలో ఐఏఎస్‌ల బదిలీలు

image

పలువురు IASలను బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. GHMCపై ప్రత్యేక దృష్టి సారిస్తూ ఇద్దరు Addl.కలెక్టర్లను నియమించింది. కూకట్‌పల్లి, శేరిలింగంపల్లి, కుత్బుల్లాపూర్ జోన్లకు సృజన, మల్కాజిగిరి, LBనగర్, ఉప్పల్ జోన్లకు వినయ్ కుమార్‌ను కేటాయించింది. PR&RD డైరెక్టర్‌గా శ్రుతి ఓజా, NZB కలెక్టర్‌గా ఇలా త్రిపాఠి, NLG కలెక్టర్‌గా చంద్రశేఖర్, నారాయణపేట్ Addl.కలెక్టర్‌గా ఉమాశంకర్‌ను నియమించింది.

News December 30, 2025

మీ పార్టీలు సరే.. ఇంట్లో వాళ్ల సంగతేంటి?

image

కొన్ని గంటల్లో కొత్త సంవత్సరం రాబోతోంది. న్యూఇయర్ అంటే తెలుగు రాష్ట్రాల్లో ధూంధాం పార్టీలుంటాయి. పబ్బులు, బార్లు, దోస్తులతో DEC 31st నైట్‌ ఎంజాయ్ చేస్తారు. పురుషులంతా వారి ఫ్రెండ్స్‌తో కలిసి సెలబ్రేట్ చేసుకోవాలని ఇప్పటికే ప్లాన్స్ కూడా చేసుకుని ఉంటారు. అయితే ఇంట్లో ఉండే వాళ్ల సంగతేంటి? అదే ఇంట్లో ఉన్న అమ్మ, అక్క, చెల్లి, భార్య.. వాళ్లకి కూడా కొత్త సంవత్సరమే కదా. వారి గురించి ఏమైనా ఆలోచించారా?

News December 30, 2025

హర్మన్ కెప్టెన్ ఇన్నింగ్స్.. భారత్ స్కోర్ ఎంతంటే?

image

శ్రీలంక ఉమెన్స్ టీమ్‌తో జరుగుతున్న 5వ టీ20లో భారత్ 175/7 రన్స్‌ చేసింది. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ఇండియా 77 పరుగులకే 5 కీలక వికెట్లు కోల్పోయింది. దీంతో కెప్టెన్ హర్మన్‌‌ప్రీత్ 43 బంతుల్లో 68 రన్స్ చేసి ఆదుకున్నారు. చివర్లో అరుంధతీ రెడ్డి బౌండరీలతో చెలరేగారు. ఆమె 11 బంతుల్లో 27* రన్స్‌తో రాణించారు.