News March 17, 2024

WPL: ఆర్సీబీ ఘన విజయం

image

WPL సీజన్-2 ఫైనల్‌లో ఢిల్లీపై ఆర్సీబీ ఘన విజయం సాధించి తొలిసారి ట్రోఫీని సొంతం చేసుకుంది. 114 పరుగుల లక్ష్యాన్ని 19.3 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి ఛేదించింది. సోఫీ డివైన్(32), స్మృతి మంధాన(31), ఎల్లిస్ ఫెర్రీ(35*) రాణించారు. ఢిల్లీ బ్యాటర్లలో షెఫాలీ వర్మ(44), మెగ్ లానింగ్(23) మినహా అందరూ విఫలమయ్యారు. బెంగళూరు బౌలర్లలో శ్రేయాంక పాటిల్ 4, సోఫీ మొలినిక్స్ 3, శోభనా ఆశా 2 వికెట్లు పడగొట్టారు.

Similar News

News March 29, 2025

రెడ్‌బుక్ పేరెత్తితే కొందరికి గుండెపోటు వస్తోంది: లోకేశ్

image

AP: తాను ఎక్కడికి వెళ్లినా రెడ్‌బుక్ గురించి ప్రస్తావన వస్తోందని మంత్రి లోకేశ్ అన్నారు. ‘రెడ్‌బుక్ గురించి మాట్లాడాల్సిన అవసరం లేదని నేను అనుకుంటున్నా. ఎందుకంటే దాని పేరు చెప్పగానే కొందరికి గుండెపోటు వస్తోంది. కొందరు బాత్రూమ్‌లో కాలుజారి పడి చెయ్యి విరగ్గొట్టుకున్నారు. అర్థమైందా రాజా? అధికారంలో ఉన్నామని గర్వం వద్దు, ఇగోలు వద్దు. కార్యకర్తల కోసం అహర్నిశలు కష్టపడి పని చేద్దాం’ అని లోకేశ్ అన్నారు.

News March 29, 2025

పాస్టర్ ప్రవీణ్ మ‌ృతి దర్యాప్తు.. పోలీసుల హెచ్చరిక

image

పాస్టర్ ప్రవీణ్ మృతికి సంబంధించి విచారణ పారదర్శకంగా జరుగుతోందని తూర్పు గోదావరి ఎస్పీ నరసింహ కిశోర్ ఓ ప్రకటనలో తెలిపారు. ‘ఐదు ప్రత్యేక బృందాలు దర్యాప్తు చేస్తున్నాయి. సీసీ ఫుటేజీల పరిశీలన, సమాచార సేకరణ జరుపుతున్నాయి. సీఎం ఎప్పటికప్పుడు ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహిస్తున్నారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగించేలా సోషల్ మీడియాలో ఎవరైనా పోస్టులు పెడితే చర్యలు తప్పవు’ అని హెచ్చరించారు.

News March 29, 2025

మూడు రోజులు సెలవులే!

image

ఐటీ ఉద్యోగులకు వరుసగా మూడు రోజులు సెలవులొచ్చాయి. ఇవాళ శనివారం, రేపు ఆదివారం (ఉగాది) వీకెండ్ కాగా రంజాన్ సందర్భంగా సోమవారం కూడా సెలవు ఉండనుంది. దీంతో హైదరాబాద్‌ను వీడి సొంతూళ్లకు వెళ్లేందుకు కొందరు సిద్ధమవుతున్నారు. మరికొందరేమో మూడు రోజులు ట్రిప్స్ లేదా దైవ దర్శనాలకు వెళ్లేందుకు బయల్దేరారు. కొందరికి రంజాన్‌కు సెలవు ఇవ్వలేదని చెబుతున్నారు. మీ ఆఫీసుల్లో సెలవుందా? ఎటైనా వెళ్తున్నారా? COMMENT

error: Content is protected !!