News February 25, 2025
WPL: యూపీ ‘సూపర్’ విజయం

ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ చరిత్రలో జరిగిన తొలి సూపర్ ఓవర్ మ్యాచ్‌లో యూపీ వారియర్స్ విజయం సాధించింది. 9 రన్స్ టార్గెట్‌తో బరిలోకి దిగిన ఆర్సీబీని ఆ జట్టు 4 పరుగులకే కట్టడి చేసింది. యూపీ బౌలర్ సోఫీ ఎకిల్‌స్టన్ సూపర్ ఓవర్‌లో కేవలం 4 పరుగులే ఇచ్చి జట్టుకు అద్భుత విజయాన్ని అందించారు. అంతకుముందు బ్యాటింగ్‌లోనూ అదరగొట్టిన సోఫీ 19 బంతుల్లో 33 రన్స్ చేసి మ్యాచ్‌ను సూపర్ ఓవర్‌కు తీసుకొచ్చారు.
Similar News
News February 25, 2025
చికిత్సకు సహకరిస్తున్న పోప్ ఫ్రాన్సిస్

పోప్ ఫ్రాన్సిస్ ఆరోగ్యం విషమంగానే ఉన్నప్పటికీ ప్రస్తుతం ఆయన శరీరం చికిత్సకు సహకరిస్తోందని వాటికన్ సిటీ తెలిసింది. ‘డబుల్ న్యూమోనియా’తో పాటు కిడ్నీ ఫెయిల్యూర్‌తో బాధపడుతున్న పోప్ 11 రోజుల నుంచి రోమ్‌లోని గెమెల్లీ ఆసుపత్రిలో ట్రీట్‌మెంట్ తీసుకుంటున్నారు. డబుల్ న్యూమోనియా వల్ల ఛాతీలో ఇన్‌ఫెక్షన్ సోకి ఆయన బ్రీతింగ్ తీసుకోవడానికి తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. దీంతో హై ఫ్లో ఆక్సిజన్ అందిస్తున్నారు.
News February 25, 2025
దుర్మార్గుడు.. ఐదుగురిని హత్య చేశాడు

కేరళలోని తిరువనంతపురంలో 23 ఏళ్ల అఫన్ అనే యువకుడు కొన్ని గంటల వ్యవధిలోనే ఐదుగురిని హత్య చేశాడు. వీరిలో తన తమ్ముడు, నానమ్మ, ఆంటీ, అంకుల్‌తో పాటు ప్రియురాలు కూడా ఉంది. ఆ దుర్మార్గుడు తల్లిపైనా దాడి చేయగా ఆమె ఆసుపత్రిలో చావుతో పోరాడుతోంది. హత్యల అనంతరం నేరుగా వెళ్లి పోలీస్ స్టేషన్‌లో లొంగిపోయాడు. తానూ విషం తాగానని చెప్పడంతో షాకైన పోలీసులు అతడిని ఆసుపత్రిలో చేర్చారు. హత్యలకు కారణాలపై విచారిస్తున్నారు.
News February 25, 2025
ఈ సింగర్ ఇద్దరు స్టార్ హీరోల చెల్లెలు తెలుసా?

సింగర్ బృంద.. తమిళ స్టార్ హీరోలు సూర్య, కార్తీల సొంత చెల్లెలు. మిస్టర్ చంద్రమౌళి మూవీతో సింగర్‌గా కెరీర్ ఆరంభించిన ఆమె తర్వాత రాక్షసి, జాక్‌పాట్, పొన్‌మగల్ వంధాల్, ఓ2లో పాటలు పాడారు. తన వదిన, సూర్య భార్య జ్యోతిక నటించిన పొన్‌మగల్ వంధాల్‌లో బృంద పాడిన ‘వా చెల్లామ్’ సాంగ్ పెద్ద హిట్టయింది. ఇక రణ్‌బీర్ కపూర్, ఆలియా భట్ జంటగా నటించిన ‘బ్రహ్మాస్త్ర’ తమిళ వెర్షన్‌లో ఆలియాకు ఈమే డబ్బింగ్ చెప్పారు.