News March 15, 2025
WPL: ఫైనల్ విజేత ఎవరో?

నేడు WPL ఫైనల్లో ఢిల్లీ క్యాపిటల్స్, ముంబై ఇండియన్స్ అమీతుమీ తేల్చుకోనున్నాయి. ఈ సారి ఎలాగైనా కప్పు కొట్టాలని ఢిల్లీ, రెండో ట్రోఫీ ఖాతాలో వేసుకోవాలని ముంబై ఉవ్విళ్లూరుతున్నాయి. ఆల్రౌండర్లు నాట్ సీవర్, హేలీ మాథ్యూస్లతో ముంబై టీమ్ స్ట్రాంగ్గా ఉంది. ఈ సీజన్లో ముంబైపై ఢిల్లీదే ఆధిపత్యం. కాగా మ్యాచ్ రా.8.00 గంటలకు ప్రారంభం కానుంది. జియో హాట్ స్టార్, స్టార్ స్పోర్ట్స్లలో లైవ్ చూడవచ్చు.
Similar News
News March 15, 2025
కాంగ్రెస్ పాలన దేశ చరిత్రలోనే మాయని మచ్చ: కేటీఆర్

కాంగ్రెస్ పాలనపై BRS వర్కింగ్ ప్రెసిడెంట్ KTR ట్విటర్లో విరుచుకుపడ్డారు. ‘సంపద సృష్టిస్తాం, ప్రజలకు పంచుతాం అని ప్రగల్భాలు పలికారు. 15 నెలల పాలనలో ఊదు కాలింది లేదు. పీరు లేచింది లేదు. రూ.1.50 లక్షల కోట్లు అప్పు తెచ్చినట్లు ప్రభుత్వమే అధికారికంగా ఒప్పుకుంది. రుణమాఫీ, రైతుభరోసా, సాగునీళ్లు, పంటల కొనుగోళ్లు ఏవీ లేవు. కాంగ్రెస్ పాలన దేశ రాజకీయ చరిత్రలోనే మాయని మచ్చ’ అని పేర్కొన్నారు.
News March 15, 2025
రోజూ డ్రింక్స్ తాగే మహిళలకు నోటి క్యాన్సర్ ముప్పు: అధ్యయనం

రోజూ కనీసం ఒక డ్రింక్ తాగే మహిళలకు నోటి క్యాన్సర్ వచ్చే ముప్పు ఐదింతలు ఎక్కువని USలోని ‘యూనివర్సిటీ ఆఫ్ వాషింగ్టన్’ పరిశోధకుల అధ్యయనంలో తేలింది. ‘డ్రింక్స్ తాగే యువతుల్లో ధూమ, మద్యపాన అలవాట్లు లేకపోయినా నోటి క్యాన్సర్ కేసులు భారీగా నమోదవుతున్నాయి. 2020లో ప్రపంచవ్యాప్తంగా 3.55 లక్షలమందికి నోటి క్యాన్సర్ సోకింది. వీరిలో ఎక్కువగా యువతులే ఉండటం ఆందోళనకరం’ అని తమ నివేదికలో వారు తెలిపారు.
News March 15, 2025
జగదీశ్ రెడ్డిపై సస్పెన్షన్ ఎత్తివేయాలి: BRS ఎమ్మెల్యేలు

TG: ఎమ్మెల్యే జగదీశ్ రెడ్డిపై సస్పెన్షన్ ఎత్తివేయాలని స్పీకర్ గడ్డం ప్రసాద్ను బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు విజ్ఞప్తి చేశారు. అసెంబ్లీలోని స్పీకర్ కార్యాలయంలో హరీశ్ రావు, తలసాని, మాధవరం కృష్ణారావు, సబితారెడ్డి, సుధీర్ రెడ్డి, వివేకానంద ఆయనను కలిశారు. జగదీశ్ రెడ్డి సస్పెన్షన్ అన్యాయమని వారు పేర్కొన్నారు. స్పీకర్ను ఏకవచనంతో పిలవలేదని, సభా సంప్రదాయాలను ఆయన ఉల్లంఘించలేదని వారు తెలిపారు.