News March 11, 2025

WPL: గెలిస్తే నేరుగా ఫైనల్‌కు

image

WPL 2025లో ముంబై ఇండియన్స్ మరోసారి ఫైనల్‌కి చేరువైంది. ఇవాళ బెంగళూరుతో జరిగే మ్యాచులో గెలిస్తే నేరుగా ఫైనల్ చేరనుంది. నిన్నటి మ్యాచులో గుజరాత్‌పై గెలిచి పాయింట్ల పట్టికలో MI(10P) రెండో స్థానానికి దూసుకొచ్చింది. ఢిల్లీకీ 10 పాయింట్లే ఉన్నా NRR ఎక్కువ ఉండటంతో తొలి స్థానంలో ఉంది. ఇవాళ్టి మ్యాచులో MI ఓడితే ఎలిమినేటర్‌లో గుజరాత్‌తో తలపడనుంది.

Similar News

News March 11, 2025

150 మంది సైనికుల ఊచకోత!

image

పాకిస్థాన్‌లో BLA (బలూచ్ లిబరేషన్ ఆర్మీ) నరమేధం సృష్టించింది. తమ అధీనంలో ఉన్న 450 మందిలో 150 మంది సైనికులను ఊచకోత కోసినట్లు బీఎల్ఏ స్వయంగా ప్రకటించింది. తమపై సైనిక చర్యకు దిగితే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించింది. కాగా బలూచిస్థాన్ ప్రావిన్స్‌లో జాఫర్ ఎక్స్‌ప్రెస్‌ను బీఎల్ఏ హైజాక్ చేసిన విషయం తెలిసిందే. ఆ రైలులో ప్రయాణిస్తున్న వందలాదిమందిని బందీలుగా తీసుకున్నారు.

News March 11, 2025

KCRను కలిసిన దాసోజు శ్రవణ్

image

TG: బీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థి దాసోజు శ్రవణ్ మాజీ సీఎం కేసీఆర్‌ను కలిశారు. తనకు MLCగా అవకాశం ఇచ్చినందుకు కుటుంబ సమేతంగా కలిసి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా కేసీఆర్ ఆశీర్వాదం తీసుకున్నారు. అటు దాసోజుకు కేసీఆర్ అభినందనలు తెలిపారు.

News March 11, 2025

రేపు 1532మందికి ఉద్యోగ నియామక పత్రాలు

image

TG: జూనియర్ లెక్చరర్(1292మంది), పాలిటెక్నిక్ లెక్చరర్(240మంది) ఉద్యోగాలకు ఎంపికైన వారికి సీఎం రేవంత్ రేపు నియామక పత్రాల్ని అందించనున్నారు. హైదరాబాద్‌లోని రవీంద్రభారతిలో ఈ కార్యక్రమం జరగనుంది. కొత్తగా కొలువుల్లోకి చేరే ఈ సిబ్బందికి విద్యాశాఖ విధానాలు, బోధనాపద్ధతులపై ట్రైనింగ్ అనంతరం పోస్టింగ్స్ ఇస్తామని విద్యాశాఖ కార్యదర్శి యోగితా రాణా తెలిపారు.

error: Content is protected !!