News March 13, 2025

WPL: గెలిస్తే ఫైనల్‌కే

image

WPL 2025లో ముంబై, గుజరాత్ మధ్య ఇవాళ ఎలిమినేటర్ మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచులో గెలిచిన జట్టు ఫైనల్ చేరనుంది. ఈ టోర్నీలో గుజరాత్‌పై ముంబై ఇప్పటివరకు ఓటమి లేకుండా సాగుతోంది. దీంతో ఇవాళ మ్యాచ్ ఆసక్తికరంగా మారనుంది. రాత్రి 7.30 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది. మరోవైపు ఇప్పటికే ఢిల్లీ ఫైనల్ చేరింది. FINAL మ్యాచ్ ఎల్లుండి జరగనుంది.

Similar News

News March 13, 2025

శ్రీవారి దర్శనానికి 8 గంటల సమయం

image

తిరుమల శ్రీవారి సర్వదర్శనానికి 8 గంటల సమయం పడుతోంది. 8 కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. నిన్న శ్రీవారిని 68,509 మంది భక్తులు దర్శించుకున్నారు. అదే సమయంలో 23,105 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. ఒక్క రోజులో స్వామి వారి హుండీ ఆదాయం రూ.3.86 కోట్లు సమకూరింది.

News March 13, 2025

ఢిల్లీలో CM రేవంత్.. ఫోన్ ట్యాపింగ్ కేసుపై ఫోకస్?

image

TG CM రేవంత్ ఢిల్లీ పర్యటనకు వెళ్లారు. ఇవాళ కేంద్ర విదేశాంగ మంత్రి జై శంకర్‌తో భేటీ కానున్నారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితులుగా ఉన్న పలువురు విదేశాల్లో తలదాచుకుంటుండగా, వారిని స్వదేశానికి రప్పించే విషయంపై ఆయనతో చర్చించనున్నట్లు తెలుస్తోంది. అలాగే గల్ఫ్ కార్మికుల సమస్యలను ఆయన దృష్టికి తీసుకెళ్లనున్నారు. అనంతరం పార్టీ అధిష్ఠానంతో మంత్రి వర్గ విస్తరణ, నామినేటెడ్ పదవులపై చర్చించే అవకాశముంది.

News March 13, 2025

Balochistan Fight: పాకిస్థాన్‌, చైనా దోచుకుంటున్నాయని..!

image

పాకిస్థాన్, చైనా కలిసి తమను దోపిడీ చేస్తున్నాయనేది బలూచిస్థాన్ జాతీయవాదుల ఆవేదన. ఆ ప్రాంతంలో బొగ్గు, సహజవాయువు, బంగారం, రాగి లాంటి ఖనిజాలు భారీగా ఉంటాయి. వాటిని దోచుకుంటూ తమ ప్రాంతాన్ని అభివృద్ధి చేయట్లేదని అక్కడి ప్రజల్లో వ్యతిరేకత పెరిగింది. అరేబియా సముద్రంతో లింక్ కోసం చైనా బలూచిస్థాన్‌లో గ్వాదర్ పోర్ట్ నిర్మిస్తోంది. ఇది CPECలో చాలా కీలకమైన ప్రాజెక్టు. వారి కోపానికి ఇదీ ఓ ప్రధాన కారణం.

error: Content is protected !!