News December 15, 2024
WPL: భారీ ధర పలికిన విండీస్ ప్లేయర్

మహిళల ప్రీమియర్ లీగ్ వేలంలో వెస్టిండీస్ ప్లేయర్ డియాండ్ర డాటిన్ భారీ ధర పలికారు. వేలంలో ఆమెను రూ.1.7 కోట్లకు గుజరాత్ జెయింట్స్ దక్కించుకుంది. T20Iల్లో సెంచరీ చేసిన తొలి మహిళా ప్లేయర్ డాటిన్ కావడం గమనార్హం. దక్షిణాఫ్రికా ప్లేయర్ నాడిన్ డి క్లర్క్‌ను రూ.30 లక్షలకు ముంబై దక్కించుకుంది. పూనమ్ యాదవ్, హీథర్ నైట్, స్నేహ్ రాణా తదితర ప్లేయర్లు అన్‌సోల్డ్‌గా మిగిలారు.
Similar News
News November 20, 2025
2031కి 100 కోట్ల 5G సబ్స్క్రిప్షన్లు

2031 చివరికి భారత్‌లో 5G సబ్స్క్రిప్షన్లు 100 కోట్లు దాటుతాయని ఎరిక్సన్ మొబిలిటీ రిపోర్ట్ అంచనా వేసింది. 2031 వరకు మొబైల్ సబ్స్క్రిప్షన్లలో 79% 5జీకి మారుతాయని పేర్కొంది. 2025 చివరికి 394 మిలియన్లకు సబ్స్క్రిప్షన్లు చేరుకున్నాయని, ఇది మొత్తం సబ్స్క్రిప్షన్లలో 32 శాతమని తెలిపింది. దేశంలో పెరుగుతున్న మొబైల్ డేటా వినియోగం, నెట్వర్క్ విస్తరణ, 5G స్మార్ట్‌ఫోన్ కొనుగోళ్లే నిదర్శనమని చెప్పింది.
News November 20, 2025
AP న్యూస్ రౌండప్

*రైతుల నుంచి ప్రతి ధాన్యం బస్తా కొంటాం: మంత్రి నాదెండ్ల మనోహర్
*బిహార్ CM నితీశ్ కుమార్‌కు YS జగన్ శుభాకాంక్షలు
*గోవాలో జరుగుతున్న ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్లో బాలకృష్ణకు సత్కారం
*డిసెంబర్ 15 నుంచి అమరావతి రైతుల రిటర్నబుల్ ప్లాట్లలో సరిహద్దుల్లేని ప్లాట్లకు కొత్త పెగ్ మార్క్‌లు వేసే ప్రక్రియ ప్రారంభం
*2026లో రిటైర్ కానున్న ఐదుగురు IAS అధికారులను నోటిఫై చేసిన అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్
News November 20, 2025
ఢిల్లీకి డీకే శివకుమార్.. సీఎం మార్పుపై జోరుగా ప్రచారం

కర్ణాటకలో CM మార్పు ప్రచారం మరోసారి జోరందుకుంది. Dy.CM డీకే శివకుమార్ మరికొంత మంది MLAలతో కలిసి ఢిల్లీకి వెళ్లారు. KAలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి నేటితో రెండున్నరేళ్లు పూర్తయింది. ఈ నేపథ్యంలో ‘పవర్ షేరింగ్’ కోసం అధిష్ఠానంపై ఒత్తిడి తెచ్చేందుకే ఆయన ఢిల్లీ బాటపట్టారని చర్చ జరుగుతోంది. ఇవాళ రాత్రికి ఖర్గేతో, రేపు KC వేణుగోపాల్‌తో DK వర్గం భేటీ కానుంది. దీంతో సీఎం మార్పుపై ఉత్కంఠ నెలకొంది.


