News August 7, 2024

ఫైనల్‌కు వినేశ్ చేతిలో ఓడిన రెజ్లర్

image

పారిస్ ఒలింపిక్స్‌ రెజ్లింగ్ మహిళల 50కిలోల విభాగం ఫైనల్‌లో వినేశ్ స్థానంలో క్యూబా రెజ్లర్ గుజ్మన్ లోపెజ్ బరిలోకి దిగనున్నారు. ఆమెను వినేశ్ సెమీస్‌లో 5-0 తేడాతో చిత్తుగా ఓడించారు. అధిక బరువు కారణంగా ఫైనల్‌కు ముందు వినేశ్‌పై IOC అనర్హత వేటు వేసిన విషయం తెలిసిందే.

Similar News

News December 15, 2025

రబీ సాగు నిరాశాజనకం

image

APలో రబీ సాగు ఆశించినస్థాయిలో సాగడం లేదు. ఈ సీజన్‌లో 20.70 లక్షల హెక్టార్లలో 22 రకాల పంటలు సాగవుతాయని అధికారులు అంచనా వేయగా ఇప్పటి వరకు 6.57 లక్షల హెక్టార్లలో మాత్రమే రైతులు పంటలు వేశారు. మొంథా, దిత్వా తుఫాన్ల కారణంగా ఖరీఫ్ పంటల కోతలు ఆలస్యమవడం ప్రధాన కారణమని అధికారులు చెబుతున్నారు. కృష్ణా డెల్టా, సాగర్ కుడి కాలువ కింద వరి సాగుకు నీటి గ్యారంటీ లేకపోవడమూ మరో కారణమని పేర్కొంటున్నారు.

News December 15, 2025

పాడి పశువులకు టీకాలు – తీసుకోవాల్సిన జాగ్రత్తలు

image

వాతావరణ మార్పుల కారణంగా పశువులకు కొన్ని బాక్టీరియా రోగాలు వచ్చే అవకాశం ఉంటుంది. అందుకే పశువులకు ఆయా సీజన్లకు అనుగుణంగా టీకాలు వేయించాలి. ఆ సమయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ☛ వాతావరణం చల్లగా ఉన్నప్పుడు(ఉదయం, సాయంత్రం) మాత్రమే టీకాలు వేయించాలి. ☛ వ్యాధి సోకిన పశువులకు ఎట్టి పరిస్థితుల్లోనూ టీకాలు వేయించకూడదు. ☛ ఒక టీకా వేసిన 10-15 రోజుల తర్వాత మాత్రమే ఇంకో టీకా వేయించాలి.

News December 15, 2025

ధనుర్మాసం ఎందుకంత ప్రత్యేకం?

image

సూర్యుడు ధనురాశిలో సంచరించే కాలాన్ని ధనుర్మాసం అంటారు. ఇది ఉత్తరాయణం ప్రారంభానికి ముందు వచ్చే పరమ పవిత్రమైన సంధికాలం. ఇది దేవతలకు రాత్రి చివరి భాగం వంటిది. ఈ మాసంలో సత్త్వగుణం వృద్ధి చెందుతుంది. భగవద్గీతలో శ్రీకృష్ణుడు ‘మాసానాం మార్గశీర్షోహం’ అని చెప్పాడు. ఆధ్యాత్మిక, భౌతిక ఫలాలను పొందడానికి, దైవారాధన చేయడానికి, దానధర్మాలు ఆచరించడానికి ఈ మాసం అత్యంత అనుకూలమైనది.