News May 8, 2025
అధికారుల పేర్లు రాసి పెట్టుకోండి: కార్యకర్తలకు జగన్ సూచన

AP: తమ కార్యకర్తలను ఇబ్బంది పెట్టే అధికారులను వదిలే ప్రసక్తే లేదని YCP అధినేత జగన్ మరోసారి తేల్చి చెప్పారు. ‘ఎవరినీ వదిలిపెట్టం, సినిమా చూపిస్తాం. తప్పు చేసిన అధికారుల పేర్లను రాసి పెట్టుకోండి. సప్త సముద్రాల అవతల ఉన్నా తీసుకొచ్చి శిక్షిస్తాం. చంద్రబాబు విలువలు లేని పాలిటిక్స్ చేస్తున్నారు. రాజకీయాలే సిగ్గుపడేలా వ్యవహరిస్తున్నారు’ అని స్థానిక సంస్థల ప్రజాప్రతినిధుల సమావేశంలో జగన్ వ్యాఖ్యానించారు.
Similar News
News November 19, 2025
ఆ భయంతోనే ఛత్తీస్‌గఢ్ నుంచి ఏపీకి!

లొంగిపోయిన మావోయిస్టు పార్టీ అగ్రనేతలు ఎక్కడ తమ వివరాలు బయటపెడతారేమోనని మిగతా నేతలు భయపడుతున్నట్లు తెలుస్తోంది. దీంతో అనేక మంది ఛత్తీస్‌గఢ్ నుంచి APకి వచ్చి తలదాచుకుంటున్నారని సమాచారం. ఎలాంటి భయం లేకుండా లొంగిపోవడానికి రావాలని, తాము రక్షణ కల్పిస్తామని ఇంటెలిజెన్స్ చీఫ్ లడ్డా చెప్పారు. అటు హిడ్మాను పట్టుకుని కాల్చి చంపినట్లు వస్తున్న వార్తలను ఆయన ఖండించారు. హిడ్మా ఎన్‌కౌంటర్‌లోనే చనిపోయాడన్నారు.
News November 19, 2025
కన్నె స్వాములు తప్పక చూడాల్సిన స్థానం

శబరిమల యాత్రలో పేరూర్‌తోడు నుంచి 12KM దూరంలో కాళైకట్టి అనే కారడవి ఉంటుంది. నేడు ఇది పచ్చని తోటగా మారింది. ఈ స్థలానికి 2 ప్రాముఖ్యతలున్నాయి. ఓనాడు అయ్యప్ప స్వామి తన సైన్య వృషభాలను ఇక్కడే కట్టేశాడట. మరోనాడు మహిషీ మర్దనం చూడడానికి వచ్చిన పరమేశ్వరుడు తన వృషభ వాహనాన్ని ఇక్కడ బంధించాడట. తొలిసారి యాత్ర చేసే కన్నె స్వాములు ఇక్కడ కొబ్బరికాయలు కొడితే ఈశ్వరుడి అనుగ్రహం కలుగుతుందని నమ్ముతారు. <<-se>>#AyyappaMala<<>>
News November 19, 2025
భారీ జీతంతో NTPCలో ఉద్యోగాలు

ఎన్టీపీసీ లిమిటెడ్ 4 ఎగ్జిక్యూటివ్(<


