News September 6, 2024
బెంగాల్లో తప్పు మీద తప్పు: గవర్నర్

వైద్యురాలిపై హత్యాచారం కేసులో పాలనా యంత్రాంగం వ్యవహరించిన తీరు అస్సలు బాగాలేదని బెంగాల్ గవర్నర్ సీవీ ఆనంద్ బోస్ అన్నారు. ప్రజల్లో న్యాయం జరుగుతుందన్న నమ్మకం పోయిందని పేర్కొన్నారు. అందుకే తీవ్ర ఆందోళనలు జరుగుతున్నాయని వెల్లడించారు. ‘బెంగాల్లో తప్పు మీద తప్పు జరుగుతోంది. ప్రభుత్వం ప్రజలకు నమ్మకం కలిగించాలి. దోషులను శిక్షించాలి. చట్టం చేస్తే సరిపోదు. పక్కాగా అమలు చేయడం మరింత ముఖ్యం’ అని తెలిపారు.
Similar News
News March 12, 2025
ఆస్పత్రి నుంచి ఉపరాష్ట్రపతి డిశ్చార్జ్

ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్‌ఖడ్ ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ఛాతీ నొప్పితో బాధపడుతూ ఆదివారం తెల్లవారుజామున ఢిల్లీ AIIMSలో చేరిన ఆయన తాజాగా కోలుకున్నారు. ఆయన ఆరోగ్యం మెరుగుపడడంతో వైద్యులు ఇవాళ డిశ్చార్జ్ చేశారు.
News March 12, 2025
నిలిచిన SBI సేవలు.. ఇబ్బందిపడ్డ యూజర్లు

దేశంలోని అతిపెద్ద బ్యాంక్ SBI సేవలు నిన్న సాయంత్రం 4 గంటల పాటు నిలిచిపోయాయి. బ్యాంక్ యూపీఐ చెల్లింపులు జరగకపోవడంతో వినియోగదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. సోషల్ మీడియా వేదికగా తమ అసహనాన్ని వెల్లడించారు. అయితే సాంకేతిక కారణాలతో ఈ ఇబ్బంది తలెత్తిందని, తర్వాత సమస్యను పరిష్కరించినట్లు SBI పేర్కొంది. కాగా దేశంలో నిత్యం 39.3 కోట్ల యూపీఐ ట్రాన్సాక్షన్లు జరుగుతున్నాయి.
News March 12, 2025
జొమాటో, స్విగ్గీకి పోటీగా ర్యాపిడో ఫుడ్‌డెలివరీ!

బైక్ ట్యాక్సీ కంపెనీ ర్యాపిడో త్వరలో ఫుడ్ డెలివరీ వ్యాపారంలోకి ప్రవేశించబోతోందని సమాచారం. ఇప్పటికే రెస్టారెంట్లతో చర్చలు ఆరంభించిందని తెలిసింది. జొమాటో, స్విగ్గీ వసూలు చేసే ప్రస్తుత కమీషన్ల ప్రక్రియను సవాల్ చేసేలా కొత్త బిజినెస్ మోడల్‌ను రూపొందిస్తోందని ఒకరు తెలిపారు. కొన్ని ఏరియాల్లో తమ టూవీలర్ ఫ్లీట్‌తో ఇండివిడ్యువల్ రెస్టారెంట్ల నుంచి ఇప్పటికే ఫుడ్ డెలివరీ చేస్తున్నట్టు తెలిసింది.