News August 26, 2024
WT20 WC: ఆసీస్ టీమ్ ప్రకటన

అక్టోబర్ 3 నుంచి ప్రారంభమయ్యే ఉమెన్స్ టీ20 వరల్డ్ కప్ కోసం డిఫెండింగ్ ఛాంపియన్ ఆస్ట్రేలియా టీమ్‌ను ప్రకటించింది. అలీసా హీలీ జట్టుకు నాయకత్వం వహించనున్నారు.
జట్టు: హీలీ, డార్సీ బ్రౌన్, ఆష్ గార్డ్నర్, కిమ్ గార్త్, గ్రేస్ హారిస్, అలనా కింగ్, లిచ్‌ఫీల్డ్, తాలియా మెక్‌గ్రాత్, సోఫీ మోలినక్స్, బెత్ మూనీ, ఎల్లీస్ పెర్రీ, మెగన్ షట్, సుదర్లాండ్, జార్జియా వారెమ్, వ్లామినెక్.
Similar News
News January 11, 2026
ఈ టిప్స్‌తో నిద్రలేమి సమస్యకు చెక్!

* ప్రతిరోజూ ఒకే సమయానికి నిద్రపోయేలా ప్లాన్ చేసుకోవాలి.
* బెడ్రూమ్లో 18-22 డిగ్రీల టెంపరేచర్ ఉండేలా చూసుకోవాలి.
* గదిలో లైటింగ్ ఎక్కువగా లేకుండా చూసుకుంటే నాణ్యమైన నిద్ర సొంతమవుతుంది.
* కెఫిన్ ఎక్కువగా ఉండే డ్రింక్స్/ఫుడ్స్‌కు దూరంగా ఉండాలి.
* విటమిన్ D, B12 లోపాలు లేకుండా చూసుకోవాలి.
* రేపటి పనులను ముందుగానే ప్లాన్ చేసుకుంటే ఆలోచనలు తగ్గి బాగా నిద్ర పడుతుంది.
News January 10, 2026
తగ్గని రష్యా.. ఉక్రెయిన్‌పై మరోసారి మిసైళ్ల దాడి!

అమెరికా దూకుడు, పశ్చిమ దేశాల హెచ్చరికలను బేఖాతరు చేస్తూ ఉక్రెయిన్‌పై రష్యా మరోసారి దాడులు చేసింది. వందలాది డ్రోన్లు, డజన్లకొద్దీ మిసైళ్లతో కీవ్‌పై విరుచుకుపడింది. నలుగురు చనిపోయారని, 25 మందికి పైగా గాయపడ్డారని ఉక్రెయిన్ తెలిపింది. యుద్ధం మొదలయ్యాక రష్యా శక్తిమంతమైన హైపర్సోనిక్ మిసైల్‌ను ఉపయోగించడం ఇది రెండోసారి అని తెలుస్తోంది. దీంతో పుతిన్ శాంతిని కోరుకోవడం లేదని యూరోపియన్ నేతలు మండిపడ్డారు.
News January 10, 2026
అమెరికాలో కాల్పులు.. ఆరుగురు మృతి

అమెరికాలో మరోసారి కాల్పులు చోటుచేసుకున్నాయి. మిసిసిపీలోని క్లే కౌంటీలో దుండగుడు జరిపిన ఫైరింగ్‌లో ఆరుగురు చనిపోయారు. మూడు వేర్వేరు ప్రాంతాల్లో అతడు దాడి చేసినట్లు అధికారులు తెలిపారు. నిందితుడిని అదుపులోకి తీసుకున్నామని చెప్పారు. కాల్పులు జరిపింది ఎవరు, ఎందుకు చేశాడనే దానికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.


