News September 11, 2024

WT20 WC: 18 ఏళ్లలోపు వారికి ఫ్రీ ఎంట్రీ

image

అక్టోబర్ 3 నుంచి ప్రారంభమయ్యే ఉమెన్స్ T20 WC మ్యాచ్‌లు చూసేందుకు 18 ఏళ్లలోపు అభిమానులకు ఫ్రీ ఎంట్రీ ఇవ్వనున్నట్లు ICC ప్రకటించింది. మహిళా క్రికెట్‌ చూసేందుకు మరింత మంది అభిమానులు తరలిరావాలనే ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది. 18 ఏళ్ల పైనున్న వాళ్లకు ఒక్కో టికెట్ ధర రూ.114 నుంచి ప్రారంభం అవుతుందని పేర్కొంది. UAE వేదికగా జరిగే ఈ మెగా టోర్నీలో 10 జట్లు 23 మ్యాచ్‌లు ఆడనున్నాయి.

Similar News

News December 22, 2024

పుణ్యక్షేత్రాల్లో పెరిగిన రద్దీ

image

వారాంతం కావడంతో తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన పుణ్యక్షేత్రాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. తిరుమలలో శ్రీనివాసుడి దర్శనానికి 12 గంటల సమయం పడుతోంది. 14 కంపార్ట్‌మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. నిన్న శ్రీవారిని 72,411మంది భక్తులు స్వామి వారిని దర్శించుకోగా హుండీకి రూ.3.44 కోట్ల ఆదాయం సమకూరింది. అటు యాదాద్రిలోనూ భక్తుల రద్దీ పెరిగింది. ఆదివారం కావడంతో భారీ సంఖ్యలో భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు.

News December 22, 2024

భారత్‌ను బలవంతం చేయలేరు: జైశంకర్

image

భారత్ ఎప్పుడైనా స్వప్రయోజనాలను దృష్టిలో పెట్టుకునే నిర్ణయం తీసుకుంటుందని విదేశీ వ్యవహారాల మంత్రి జైశంకర్ తేల్చిచెప్పారు. నిర్ణయాల్ని మార్చుకునేలా తమను వేరే దేశాలు ప్రభావితం చేయలేవని స్పష్టం చేశారు. ‘స్వతంత్రంగా ఉండేందుకు, మధ్యస్థంగా ఉండటానికి మధ్య వ్యత్యాసం ఉంది. మాకెప్పుడూ భారత ప్రయోజనాలు, ప్రపంచ శాంతే ముఖ్యం. అందుకు అవసరమైన నిర్ణయాలే తీసుకుంటాం. భారతీయతను కోల్పోకుండా ఎదుగుతాం’ అని వివరించారు.

News December 22, 2024

టోల్ వసూలు చేస్తూనే ఉంటామంటే కుదరదు: సుప్రీం

image

ఇష్టమొచ్చినంత కాలం టోల్ వసూలు చేసుకోవడం నిరంకుశత్వమేనని సుప్రీం కోర్టు తేల్చిచెప్పింది. ‘టోల్ వసూలు శాశ్వతం కాదు. ప్రాజెక్టులనేవి ప్రజల కోసమే తప్ప ప్రైవేటు సంస్థల లాభార్జన కోసం కాదు. ప్రజలపై అన్యాయంగా భారం మోపడం ఆమోదయోగ్యం కాదు’ అని పేర్కొంది. ఢిల్లీ-నోయిడా ఫ్లైవే టోల్ రుసుము ఒప్పందాన్ని అలహాబాద్ హైకోర్టు కొట్టివేయడాన్ని నిర్మాణ సంస్థ సుప్రీంలో సవాలు చేయగా ధర్మాసనం ఈ మేరకు వ్యాఖ్యానించింది.