News November 3, 2025
WWC: ప్లేయర్లకు డైమండ్ నెక్లెస్‌ల బహుమతి!

మహిళల వన్డే ప్రపంచ కప్ విజేతగా నిలిచిన భారత ప్లేయర్లకు సూరత్(గుజరాత్) వ్యాపారవేత్త, MP గోవింద్ ఢోలకియా స్పెషల్ గిఫ్టులను ప్రకటించారు. భారతీయులు గర్వపడేలా అమ్మాయిలు అత్యుత్తమ ప్రదర్శన కనబర్చారని, వారికి వజ్రాల ఆభరణాలు, ఇళ్లకు అమర్చేందుకు సోలార్ ప్యానెళ్లను గిఫ్ట్‌గా ఇస్తున్నట్టు తెలిపారు. ఈ విజయం మన దేశానికి కొత్తవెలుగులు తెచ్చిందని BCCI ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లాకు రాసిన లేఖలో పేర్కొన్నారు.
Similar News
News November 4, 2025
షెఫాలీ బౌలింగ్ మాకు బిగ్ సర్‌ప్రైజ్: లారా

తాము వరల్డ్ కప్ ఫైనల్లో ఓడిపోవడానికి షెఫాలీ వర్మ బౌలింగ్ కూడా కారణమని SA కెప్టెన్ లారా ఒప్పుకున్నారు. ‘షెఫాలీ బౌలింగ్ మాకు బిగ్ సర్‌ప్రైజ్. WC పైనల్‌లాంటి మ్యాచుల్లో పార్ట్‌టైమ్ బౌలర్లకు వికెట్లు కోల్పోవడం కరెక్ట్ కాదు. ఆమె బంతిని నెమ్మదిగా సంధిస్తూనే రెండు వికెట్లు తీసుకుంది. ఇంక ఆమెకు వికెట్స్ ఇవ్వకూడదు అనుకుంటూ మిస్టేక్స్ చేశాం. భారత్ నిర్ణయం మమ్మల్ని ఆశ్చర్య పరిచింది’ అని లారా తెలిపారు.
News November 4, 2025
నవంబర్ 4: చరిత్రలో ఈరోజు

✦ 1889: పారిశ్రామికవేత్త, స్వాతంత్ర్య సమరయోధుడు జమ్నాలాల్ బజాజ్ జననం (ఫొటోలో)
✦ 1929: గణిత, ఖగోళ, జ్యోతిష శాస్త్రవేత్త శకుంతలా దేవి జననం (ఫొటోలో)
✦ 1932: సినీ దర్శకుడు, నిర్మాత వి.బి.రాజేంద్రప్రసాద్ జననం
✦ 1944: ఇండియన్ ఎయిర్‌ఫోర్స్‌లో తొలి మహిళా ఎయిర్ మార్షల్ పద్మావతి బందోపాధ్యాయ జననం
✦ 1964: దర్శకుడు జొన్నలగడ్డ శ్రీనివాసరావు జననం
✦ 1971: నటి టబు జననం
News November 4, 2025
పుట్టినరోజు శుభాకాంక్షలు

ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.


