News October 22, 2025

WWC: పాక్ ఔట్.. భారత్‌లోనే సెమీస్, ఫైనల్

image

నిన్న సౌతాఫ్రికా చేతిలో ఓటమితో ఉమెన్స్ వరల్డ్ కప్ నుంచి పాక్ క్రికెట్ జట్టు నిష్క్రమించిన విషయం తెలిసిందే. దీంతో సెమీఫైనల్, ఫైనల్ మ్యాచ్‌లు భారత్‌లోనే జరగనున్నాయి. పాక్ సెమీస్‌/ఫైనల్‌కు వెళ్తే ఆ మ్యాచ్‌లు శ్రీలంకలో నిర్వహించాలన్న ఉద్దేశంతో ICC ఇంకా వేదికలను ఖరారు చేయలేదు. ఇప్పుడు పాక్ ఇంటికెళ్లడంతో ఈనెల 29, 30 తేదీల్లో సెమీఫైనల్స్, NOV 2న ఫైనల్ INDలోనే నిర్వహించనుంది.

Similar News

News October 22, 2025

అధికారంలోకి రాగానే బల్క్ డ్రగ్‌ పార్కు రద్దు చేస్తాం: బొత్స

image

AP: అనకాపల్లి(D) రాజయ్యపేటలో బల్క్ డ్రగ్ పార్కు ఏర్పాటును వ్యతిరేకిస్తూ ఆందోళన చేస్తున్న మత్స్యకారులకు అండగా ఉంటామని YCP MLC బొత్స సత్యనారాయణ అన్నారు. ‘ఆందోళన చేస్తున్న మత్స్యకారులు సంఘ విద్రోహ శక్తులా? వారిని ఎందుకు నిర్బంధిస్తున్నారు? వైసీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే బల్క్ డ్రగ్‌ పార్కును రద్దు చేస్తాం. త్వరలో జగన్ రాజయ్యపేటలో పర్యటిస్తారు’ అని స్పష్టం చేశారు.

News October 22, 2025

వంట చేసేటపుడు ఈ తప్పులు చేస్తున్నారా?

image

ఆరోగ్యంగా ఉండటానికి ఎలా వంట చేస్తున్నామనేది కూడా ముఖ్యమంటున్నారు నిపుణులు. డీప్ ఫ్రైడ్, ఎయిర్ ఫ్రైయర్‌లో చేసే కొన్ని వంటలు, చికెన్, చేపలను ఎక్కువగా గ్రిల్ చేస్తే హెటెరోసైక్లిక్ అమైన్, పాలీసైక్లిక్ అరోమాటిక్ హైడ్రోకార్బన్స్, నాన్‌స్టిక్ పాన్లలో వంట చేస్తే విషపూరిత పదార్థాలు విడుదలవుతాయంటున్నారు. బేకింగ్, రోస్టింగ్, తక్కువ మంటపై ఉడికించడం వల్ల ఆహారంలో పోషకాలు నశించకుండా ఉంటాయని సూచిస్తున్నారు.

News October 22, 2025

సచిన్‌ను దాటేసేవాడిని.. మైక్ హస్సీ ఆసక్తికర వ్యాఖ్యలు

image

ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ మైక్ హస్సీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘ముందుగా ఛాన్స్‌లు వచ్చుంటే నా గణాంకాలు ఇంకోలా ఉండేవి. బహుశా సచిన్ కంటే 5 వేల పరుగులు ఎక్కువ చేసుండేవాడిని. అత్యధిక సెంచరీలు, యాషెస్, వరల్డ్‌కప్ గెలుపులు వంటివెన్నో నమోదయ్యేవి’ అని ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. ఫస్ట్ క్లాస్‌ క్రికెట్‌లో హస్సీ 61 సెంచరీలు, 23వేల రన్స్ చేశారు. కానీ తీవ్ర పోటీ వల్ల 28 ఏళ్లకు AUS తరఫున అరంగేట్రం చేశారు.