News September 6, 2024

‘X’లో పోస్ట్.. గంటలో సమస్య పరిష్కరించిన మంత్రి గొట్టిపాటి

image

టంగుటూరు మండలం జమ్ములపాలెంలో నాలుగేళ్ల నుంచి లో వోల్టేజీ సమస్య నెలకొంది. దీంతో నిత్యం ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఉద్యోగులు మొదలు వృద్ధులు, చిన్నారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దీనిపై స్థానిక యువకుడు సమస్యను ప్రస్తావిస్తూ ‘X’ వేదికగా విద్యుత్ శాఖ మంత్రికి పోస్ట్ చేశారు. దీంతో స్పందించిన మంత్రి గంటలోనే సంబంధిత అధికారులతో మాట్లాడారు. సమస్యకు పరిష్కారం చూపాలన్నారు.

Similar News

News October 22, 2025

ప్రకాశం జిల్లాకు NDRF బృందాలు: హోం మంత్రి

image

ప్రకాశం జిల్లాకు మరో రెండు రోజులపాటు భారీ తుఫాను హెచ్చరికల నేపథ్యంలో జిల్లా అధికార యంత్రాంగానికి హోం మంత్రి అనిత బుధవారం కీలక ఆదేశాలు జారీ చేశారు. జిల్లాకు NDRF బృందాలను పంపించేలా ఆమె ఆదేశించారు. దీంతో ప్రకాశం జిల్లాపై ఎలాంటి తుఫాన్ ప్రభావం ఉన్నా ఎదుర్కొనేందుకు జిల్లా అధికారులు, కలెక్టర్ రాజాబాబు సారథ్యంలో సిద్ధమయ్యారు.

News October 22, 2025

ప్రకాశం: విద్యుత్ షాక్‌తో తండ్రీకొడుకు మృతి.!

image

ప్రకాశం జిల్లా పొదిలి మండలం సలకనూతల గ్రామం సమీపంలో మంగళవారం ఘోర విషాదం చోటుచేసుకుంది. పొలం పనులు ముగించుకొని భారీ వర్షంలో ట్రాక్టర్‌పై గ్రామానికి వెళ్తున్న తండ్రీకొడుకు విద్యుత్ స్తంభాన్ని ఢీకొనడంతో షాక్ తగిలి అక్కడికక్కడే మృతి చెందారు. మృతులు మాదాల పెదకోటయ్య(60), మాదాల వెంకటేశ్వర్లు(25)గా గుర్తించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు.

News October 22, 2025

తుఫాన్ ఎఫెక్ట్.. ప్రకాశం కలెక్టర్ హెచ్చరికలు జారీ

image

జిల్లా వ్యాప్తంగా బుధవారం నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్న నేపథ్యంలో కలెక్టర్ రాజాబాబు మంగళవారం హెచ్చరికలు జారీ చేశారు. మత్స్యకారులు వేటకు వెళ్ళవద్దన్నారు. గంటకు 50 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉన్న నేపథ్యంలో ప్రజలు జాగ్రత్తగా ఉండాలన్నారు. కలెక్టరేట్లో 1077 టోల్ ఫ్రీ నంబర్‌తో పాటు కమాండ్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశామన్నారు.