News November 19, 2025
X(ట్విటర్) డౌన్

ప్రముఖ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ X(ట్విటర్) డౌన్ అయింది. ట్వీట్లు చేయలేకపోతున్నామని యూజర్లు ఇతర SM పేజీల్లో కామెంట్లు పెడుతున్నారు. దేశవ్యాప్తంగా ఇదే తరహా ఆటంకం ఏర్పడినట్లు తెలుస్తోంది. మీకూ ఈ సమస్య ఎదురవుతోందా? COMMENT
Similar News
News April 2, 2026
మామిడి కాయలకు ‘ఫ్రూట్ కవర్స్’తో లాభం

వాతావరణ పరిస్థితులు, పురుగులు, పండు ఈగ, ఇతర కీటకాల వల్ల మామిడి పంటకు నష్టం ఎక్కువగా ఉంటుంది. అందుకే నిమ్మ లేదా కోడి గుడ్డు సైజుకు మామిడి కాయ వచ్చాక ‘ఫ్రూట్ కవర్స్’ కట్టాలి. దీని వల్ల చెట్టుపై రసాయనాలు పిచికారీ చేసినా అవి పండుపై పడవు. అలాగే కవర్ కట్టిన కాయపై ఎలాంటి మచ్చలు, చీడపీడల లక్షణాలు కనిపించవు. ఇతర కాయల కంటే ఎక్కువ బరువు పెరిగి మంచి ధర పలుకుతాయి. ఈ కవర్స్ వాటర్ ప్రూఫ్. నీరు పడినా ఏమీ కావు.
News April 2, 2026
పంత్ ఓపెనర్‌గానే రావాలి: అశ్విన్

LSG కెప్టెన్ పంత్ బ్యాటింగ్ పొజిషన్‌పై అశ్విన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఓపెనర్‌గా విఫలమైనప్పటికీ పంత్ ఆ స్థానాన్ని వదలొద్దని సూచించారు. పవర్ ప్లే తర్వాత వస్తే బౌలర్లు ఈజీగా కట్టడి చేస్తారని, అందుకే 14 మ్యాచ్‌ల్లోనూ ఓపెనర్‌గానే రావాలని కోరారు. కోచ్ లాంగర్, LSG మేనేజ్‌మెంట్‌లో ఎవరైనా ఈ విషయంపై పంత్‌కు నచ్చజెప్పి స్వేచ్ఛగా ఆడే అవకాశం ఇవ్వాలని సూచించారు.
News April 2, 2026
ఆ థియేటర్లలో ఇక పర్సెంటేజీ సిస్టమ్: ఎగ్జిబిటర్ల నిర్ణయం

TG: రెంటల్ సిస్టమ్ స్థానంలో పర్సెంటేజీ విధానం అమలు చేయాలని 23 థియేటర్ల యాజమాన్యాలు నిర్ణయించాయి. దీని ప్రకారం కలెక్షన్లలో తొలివారం 60%, రెండో వారం 50%, మూడో వారం 40% థియేటర్లకు అందనుంది. ఇది రేపటి నుంచి అమల్లోకి రానుంది. ఇప్పటిదాకా డిస్ట్రిబ్యూటర్లు అద్దె ప్రాతిపదికన చెల్లింపులు చేసే వారు. దీంతో లగ్జరీ సదుపాయాలు కల్పిస్తున్న తాము నష్టపోతున్నామని సదరు థియేటర్ల ఓనర్లు ఈ నిర్ణయం తీసుకున్నారు.


