News January 18, 2026
X యూజర్లకు మస్క్ ₹9 కోట్ల ఆఫర్!

ఎలాన్ మస్క్ అద్భుతమైన ఆఫర్ ప్రకటించారు. ‘X’లో అత్యుత్తమంగా నిలిచే ఒక లాంగ్ ఫామ్ ఆర్టికల్‌కు ఏకంగా $1M (సుమారు ₹9 కోట్లు) బహుమతి ఇస్తామన్నారు. క్రియేటర్లను ప్రోత్సహించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నారు. ఆర్టికల్ కనీసం 1,000 పదాలు ఉండాలి. కంటెంట్ ఒరిజినల్ అయి ఉండాలి. AI వాడొద్దు. ప్రస్తుతానికి ఈ పోటీ జనవరి 28 వరకు అమెరికాలోని ప్రీమియం యూజర్లకు మాత్రమే అందుబాటులో ఉంది.
Similar News
News February 21, 2026
260 పోస్టులు.. అప్లై చేశారా?

<
News February 21, 2026
ఎందుకలా?!: గాలి మనకు కనిపించదు..

ఏదైనా వస్తువు మనకు కనిపిస్తుందంటే దానిపై కాంతి పడి పరావర్తనం(రిఫ్లెక్షన్) చెందిందని అర్థం. అటు ఏ పదార్థం/వస్తువు ఏర్పడాలన్నా అణువుల కలయిక అవసరం. అయితే గాలిలో నైట్రోజన్, ఆక్సిజన్ వంటి గ్యాసెస్ అణువులున్నా కనిపించకపోవడానికి కారణం వాటి నిర్మాణం. అవి చాలా సూక్ష్మంగా, పారదర్శకంగా ఉంటాయి. దీంతో వాటిపై కాంతి పడినా రిఫ్లెక్ట్ చేయలేవు. ఫలితంగా గాలిని చూడలేం. ప్రతిరోజూ 2pmకు ఇలా ఓ కొత్త విషయం ఎందుకలా?!లో.
News February 21, 2026
మిరపలో పూత, కాయతొలుచు పురుగు నివారణ

చలి తీవ్రత పెరిగిన ప్రస్తుత తరుణంలో మిరప పంటలో పూత పురుగు, కాయ తొలుచు పురుగు ఉద్ధృతి కూడా ఎక్కువగా ఉంటుంది. ☛ మిరపలో పూత పురుగు నివారణకు లీటరు నీటికి కార్బోసల్ఫాన్ 1.6ml మందును 1500 పి.పి.ఎం వేపనూనె 5mlతో కలిపి పిచికారీ చేయాలి.
☛ మిరపలో కాయతొలుచు పురుగు నివారణకు లీటరు నీటికి ఫ్లూబెండమైడ్ + థయాక్లోప్రిడ్ 0.5 మి.లీ. లేదా ఎమామెక్టిన్ బెంజోయేట్+ ఫిప్రోనిల్ 1.2 మి.లీ. మందును కలిపి పిచికారీ చేయాలి.


