News December 24, 2024
X ప్రీమియం ప్లస్ ఛార్జీలు భారీగా పెంపు
సోషల్ మీడియా ప్లాట్ఫామ్ X తన ప్రీమియం ప్లస్ ఛార్జీలను దాదాపు 40 శాతం పెంచింది. ప్రస్తుతం భారత్లో నెలకు ధర రూ.1,300 కాగా ఏటా రూ.13,600గా వసూలు చేస్తోంది. దీన్ని నెలకు రూ.1,750, ఏటా రూ.18,300కు పెంచింది. అయితే 2025 జనవరి 21వ తేదీ కంటే ముందే బిల్లింగ్ సైకిల్ మొదలైన వారికి పాత ధరలకే ప్రీమియం ప్లస్ సేవలు అందనున్నాయి. ఈ చందాదారులకు పూర్తిగా యాడ్ ఫ్రీ కంటెంట్ లభిస్తుంది.
Similar News
News December 24, 2024
ముగిసిన శ్యామ్ బెనగల్ అంత్యక్రియలు
సినీ దర్శకుడు శ్యామ్ బెనగల్ అంత్యక్రియలు ముగిశాయి. ముంబైలోని శివాజీ పార్కులో రాష్ట్ర ప్రభుత్వ లాంఛనాలతో అంతిమ సంస్కారాలను పూర్తి చేశారు. ఆయన కుటుంబీకులు, సినీరంగ ప్రముఖులు కార్యక్రమానికి హాజరయ్యారు. ఇక సెలవంటూ అశ్రునయనాలతో నివాళులర్పించారు. ఆయన రూపొందించిన కళాఖండాల్ని ఈ సందర్భంగా గుర్తుచేసుకున్నారు. మూత్ర పిండాల సమస్యతో శ్యామ్ సోమవారం కన్నుమూసిన సంగతి తెలిసిందే.
News December 24, 2024
ఆ మూడు రంగాలు రాణించాయి
స్టాక్ మార్కెట్లో ఫ్లాట్ ట్రెండ్లోనూ FMCG, Auto, Oil & Gas షేర్లు అరశాతం మేర రాణించాయి. Bearish Spinning Top Candleతో రోజును ఆరంభించిన బెంచ్ మార్క్ సూచీలు చివరికి ఫ్లాట్గా ముగిశాయి. Sensex 78,472(-67), Nifty 23,727(-25) వద్ద స్థిరపడ్డాయి. మెటల్, మీడియా, IT షేర్లు నష్టపోయాయి. Tata Motors, Adani Ent టాప్ గెయినర్స్. Power Grid, JSW Steel, SBI Life టాప్ లూజర్స్.
News December 24, 2024
ప్రతి రాష్ట్రంలో శ్రీవారి ఆలయం: టీటీడీ
AP: దేశంలోని అన్ని రాష్ట్రాల రాజధానుల్లో వేంకటేశ్వరస్వామి ఆలయం నిర్మిస్తామని TTD EO శ్యామలరావు తెలిపారు. ఇందుకు సంబంధించిన విధివిధానాలను రూపొందిస్తున్నట్లు చెప్పారు. ‘ప్రపంచంలోని పలు దేశాల్లో శ్రీవారి ఆలయాలు నిర్మిస్తాం. సీఎం ఆదేశాల మేరకు ఇందుకు ఓ కమిటీ వేస్తున్నాం. నడక దారిలో వచ్చే భక్తుల కోసం ఆరోగ్య సదుపాయాలు కల్పిస్తాం. TTD సేవలపై భక్తుల నుంచి ఫీడ్బ్యాక్ తీసుకుంటాం’ అని పేర్కొన్నారు.