News July 31, 2024

అమరావతిలో XLRI క్యాంపస్

image

AP: దేశంలో టాప్ బిజినెస్ స్కూల్‌గా పేరొందిన జేవియర్ స్కూల్ ఆఫ్ బిజినెస్(XLRI) అమరావతిలో క్యాంపస్ ప్రారంభించనుంది. 5 వేల మంది విద్యార్థులు చేరేలా 50 ఎకరాల్లో రూ.250 కోట్లతో క్యాంపస్ ఏర్పాటుకు ప్లాన్ చేస్తోంది. 2019కి ముందు VIT యూనివర్సిటీకి సమీపంలో XLRIకు అప్పటి ప్రభుత్వం భూములు కేటాయించింది. శంకుస్థాపన జరిగినా నిర్మాణాలు జరగలేదు. తాజాగా ప్రభుత్వం మారడంతో ఈ సంస్థ క్యాంపస్ ఏర్పాటుకు ముందుకొచ్చింది.

Similar News

News February 2, 2025

షర్మిలతో విజయసాయిరెడ్డి భేటీ?

image

AP: రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలతో YCP మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి భేటీ అయినట్లు తెలుస్తోంది. 3 రోజుల కిందట హైదరాబాద్‌లోని లోటస్‌పాండ్‌లో దాదాపు 3 గంటల పాటు సమావేశం అయినట్లు సమాచారం. ఈ భేటీలో రాష్ట్రానికి సంబంధించిన రాజకీయ అంశాలు చర్చకు వచ్చినట్లు వినికిడి. ఇటీవల వైసీపీ, రాజకీయాలకు గుడ్ బై చెప్పిన VSR షర్మిలతో రహస్యంగా భేటీ కావడంపై రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చ జరుగుతోంది.

News February 2, 2025

ఉప్పు గనుల్లో ఉంచి చికిత్స చేస్తారు!

image

ఆస్తమా రోగులకు వినూత్నంగా చికిత్స అందిస్తోంది ఉక్రెయిన్. అక్కడున్న ఉప్పు గనుల్లో ఏర్పాటు చేసిన ప్రత్యేక రిసార్ట్ ఉబ్బసం రోగులకు ట్రీట్మెంట్ ఇస్తోంది. గనిలోని అధిక ఉప్పు సాంద్రత ఒక మైక్రోక్లైమేట్‌ను సృష్టించి ఊపిరితిత్తులను పొడిగా ఉంచడంలో సహాయపడుతుందని వైద్యులు చెబుతున్నారు. రోగులు గనిలోనే కొంత సమయాన్ని వెచ్చించాల్సి ఉంటుంది. ఇలా చేయడం వల్ల శ్వాసకోశ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుందని నమ్ముతారు.

News February 1, 2025

భారీగా పెరిగిన జీఎస్టీ కలెక్షన్లు

image

దేశంలో జనవరి నెలకు సంబంధించి జీఎస్టీ వసూళ్లు భారీగా పెరిగాయి. 12.3శాతం పెరిగి రూ.1,95,506 కోట్లకు చేరినట్లు కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. ఇందులో దేశీయ లావాదేవీలతో సమకూరిన జీఎస్టీ రూ.1.47 లక్షల కోట్లు కాగా, దిగుమతి వస్తువులపై విధించిన పన్నులతో వచ్చిన ఆదాయం రూ.48,382 కోట్లుగా ఉంది. రీఫండ్స్ కింద రూ.23,853 కోట్లు విడుదల చేయగా, చివరకు వసూళ్లు రూ.1.72 లక్షల కోట్లుగా ఉన్నాయి.