News May 25, 2024

భక్తులతో నిండిపోయిన యాదగిరిగుట్ట

image

TG: వేసవి సెలవులు ఉండటంతో ప్రముఖ పుణ్యక్షేత్రం యాదగిరిగుట్టకు భక్తులు పోటెత్తుతున్నారు. ఇవాళ స్వామివారి ధర్మ దర్శనానికి 3 గంటల సమయం పడుతోంది. క్యూ కాంప్లెక్సులు భక్తులతో నిండిపోయాయి. కొండకింద ఆధ్యాత్మిక వాడలోని పుష్కరిణి ప్రాంగణం, వ్రత మండపం జనాలతో కిక్కిరిసిపోయాయి. వాహనాల పార్కింగ్ నిండిపోవడంతో ట్రాఫిక్ జామ్ అవుతోంది. మరోవైపు ఏపీ మంత్రి రోజా లక్ష్మీనరసింహ స్వామిని దర్శించుకున్నారు.

Similar News

News December 9, 2025

భారత్ రైస్‌పై US టారిఫ్స్.. ఎవరికి నష్టం?

image

భారత్ రైస్‌పై US <<18509981>>టారిఫ్స్<<>>(ప్రస్తుతం 40%) పెంచితే మనం కంగారుపడాల్సిన అవసరంలేదని వాణిజ్య నిపుణులు అంటున్నారు. ‘2024-25లో ఇండియా $337.10 మిలియన్ల బాస్మతి రైస్‌, $54.64 మిలియన్ల నాన్-బాస్మతి రైస్‌ ఎగుమతి చేసింది. IND బాస్మతిలో ఉండే రిచ్ అరోమా, టెక్స్‌చర్, టేస్ట్‌ US రైస్‌లో ఉండదు. సుంకాల భారం వినియోగదారుల మీదే పడుతుంది. ఇతర దేశాల్లోనూ మన రైస్‌కు డిమాండ్, మార్కెట్ పెరుగుతోంది’ అని చెబుతున్నారు.

News December 9, 2025

క్వార్టర్ మందు.. చికెన్ బిర్యానీ!

image

TG: తొలి విడత పంచాయతీ ఎన్నికల ప్రచారం మరికాసేపట్లో ముగియనుండటంతో గ్రామాల్లో ప్రలోభాల పర్వం జోరందుకుంది. సర్పంచ్, వార్డు అభ్యర్థులు ఓటర్లకు గాలం వేస్తున్నారు. ఓటుకు రూ.1000-4000 వరకు ఇస్తున్నట్లు సమాచారం. కొన్ని గ్రామాల్లో చికెన్ బిర్యానీ, క్వార్టర్, కూల్‌డ్రింక్స్ పంచుతున్నారు. మరికొన్ని చోట్ల ఇంటికి కేజీ కోడికూర పంపిణీ చేస్తున్నట్లు తెలుస్తోంది. మరి మీ గ్రామంలో పరిస్థితి ఎలా ఉంది? COMMENT

News December 9, 2025

రైజింగ్ గ్లోబల్ సమ్మిట్‌.. రెండో రోజు భారీగా పెట్టుబడులు

image

TG: రైజింగ్ గ్లోబల్ సమ్మిట్‌లో రెండో రోజు పెట్టుబడులు వెల్లువెత్తాయి. ఇప్పటివరకు రూ.1.11లక్షల కోట్ల పెట్టుబడులపై ప్రభుత్వంతో పలు కంపెనీలు ఒప్పందాలు చేసుకున్నాయి. పర్యాటక రంగంలో ₹7,045 కోట్లు, సల్మాన్ ఖాన్ వెంచర్స్ ఇండస్ట్రీస్ ₹10,000Cr, ఫెర్టిస్ ₹2000Cr, హెటిరో ₹1800Cr, JCK ఇన్ఫ్రా ₹9000Cr, AGP ₹6,750Cr, భారత్ బయోటెక్ ₹1000Cr పెట్టుబడులు పెట్టనున్నాయి. వీటి ద్వారా 40K+ ఉద్యోగాలు రానున్నాయి.