News March 18, 2024
యాదగిరిగుట్ట: ఒకేరోజు అత్తాకోడలు మృతి

అత్త మృతిని తట్టుకోలేక కోడలు గుండెపోటుతో కుప్పకూలింది. యాదగిరిగుట్ట మండలం గొల్లగుడిసెకి చెందిన చుక్కల భారతమ్మ(65) ఆదివారం ఉదయం గుండెపోటుతో మృతిచెందింది. అత్త మృతదేహాన్ని చూసిన కోడలు మంగమ్మ(26) రోదిస్తూనే పడిపోయి అపస్మారకస్థితిలోకి వెళ్లింది. వెంటనే భువనగిరి ఆస్పత్రికి తీసుకెళ్లగా అప్పటికే గుండెపోటుతో మృతిచెందినట్లు వైద్యులు నిర్ధారించారు. ఒకేరోజు అత్తాకోడళ్ల మృతితో గ్రామంలో విషాదం నెలకొంది.
Similar News
News February 25, 2026
నల్గొండ: నిధుల లేమితో డీఆర్డీఏ సతమతం

నల్గొండ జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ (డీఆర్డీఏ) ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయింది. ఖజానా ఖాళీ కావడంతో ఆరు నెలలుగా సుమారు రూ.60 వేల విద్యుత్ బిల్లులు పెండింగ్‌లో పడ్డాయి. ఎప్పుడు కరెంటు కోత విధిస్తారోనని అధికారులు ఆందోళన చెందుతున్నారు. కనీసం స్టేషనరీ ఖర్చులకు కూడా నిధులు లేకపోవడంతో కార్యాలయ నిర్వహణ భారంగా మారింది.
News February 25, 2026
నల్గొండ జిల్లాలో ముగ్గురు వైద్యులపై వేటు

రాష్ట్రంలో విధులకు హాజరుకాకుండా దీర్ఘకాలిక సెలవుల్లో ఉన్న 94 మంది వైద్యులను తొలగిస్తూ DME నరేంద్రకుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. వీరిలో నల్గొండ జిల్లాకు చెందిన అసిస్టెంట్ ప్రొఫెసర్లు ప్రియదర్శిని, మాధురి, శ్రీవిద్య మాధ ఉన్నారు.
News February 25, 2026
NLG: సెల్లులు స్విచాఫ్.. అజ్ఞాతంలో రైస్ మిల్లర్లు..!

జిల్లాలో కోట్లాది రూపాయల ప్రభుత్వ ధాన్యం కుంభకోణానికి పాల్పడిన మిల్లర్లు పోలీసులకు దొరకకుండా పరారయ్యారు. తమపై కేసులు నమోదు కాబోతున్నాయనే ముందస్తు సమాచారంతో శనివారం నుంచే వారంతా ఫోన్లు స్విచాఫ్ చేసి అజ్ఞాతంలోకి వెళ్లినట్లు తెలుస్తోంది. ఈ కుంభకోణంపై ఎస్పీ శరత్ చంద్ర పవార్ స్పందించారు. ప్రభుత్వ ధాన్యాన్ని లూటీ చేసిన వారిని విడిచిపెట్టే ప్రసక్తే లేదని, పరారీలో ఉన్న నిందితులను పట్టుకుంటామన్నారు.


