News August 7, 2024
హమాస్ కొత్త చీఫ్‌గా యాహ్యా సిన్వర్

హమాస్ కొత్త పొలిటికల్ చీఫ్‌గా యాహ్యా సిన్వర్ వ్యవహరించనున్నారు. ఇస్మాయిల్ హనియే హత్యకు గురికావడంతో సిన్వర్‌ను నియమించినట్లు హమాస్ ప్రకటించింది. గతేడాది అక్టోబర్ 7న ఇజ్రాయెల్‌పై దాడి చేయడంలో సిన్వర్ సూత్రధారి అని తెలుస్తోంది. ప్రస్తుతం ఆయన గాజాలోనే నివసిస్తున్నారు. 2017 నుంచి సిన్వర్ అజ్ఞాతంలోనే ఉన్నట్లు తెలుస్తోంది. ఇజ్రాయెల్‌తో పోరుకు హమాస్ గ్రూప్‌ను ఆయన బలోపేతం చేయనున్నారు.
Similar News
News November 12, 2025
భారతీయ సంప్రదాయంలో పెళ్లి చేసుకున్న ఇటలీ జంట

భారతీయ సంప్రదాయంపై నమ్మకంతో ఇటలీ నుంచి వచ్చిన జంట కాశీలో వివాహం చేసుకున్నారు. పెళ్లి కూతురు యాంటీలియా, పెళ్లి కొడుకు గ్లోరియస్ సనాతన సంప్రదాయం ప్రకారం నవదుర్గ ఆలయంలో ఒక్కటయ్యారు. ఆచార్య మనోజ్ మంత్రాలు చదువుతుండగా ఈ జంట దండలు మార్చుకుని, బొట్టు పెట్టుకుని, అగ్నిసాక్షిగా ఏడడుగులు నడిచింది. ఏడాది క్రితం వీరు క్రిస్టియన్ పద్ధతిలో పెళ్లి చేసుకున్నపట్పికీ ఇప్పుడు భారతీయ సంప్రదాయంలో వివాహమాడటం గమనార్హం.
News November 12, 2025
అండ దానం గురించి తెలుసా?

వయసు పైబడిన మహిళలు, పదే పదే ఐ.వి.ఎఫ్‌లు ఫెయిల్ అయిన వాళ్లకు అండాల అవసరం ఉంటుంది. అలాగే ఆర్టిఫిషియల్ రిప్రొడక్టివ్ బ్యాంకుల నుంచి మాత్రమే అండాలను తీసుకోవలసి ఉంటుంది. గతంలో ఏ మహిళైనా, ఎన్నిసార్లైనా తమ అండాలను అమ్ముకోగలిగే వెసులుబాటు ఉండేది. కానీ ఇప్పుడు 23 నుంచి 35 ఏళ్ల మహిళలు మాత్రమే ఎగ్ డొనేషన్‌కు అర్హులు. అలాగే ఒక మహిళ తన జీవిత కాలంలో, కేవలం ఒక్కసారి మాత్రమే అండాలను డొనేట్ చేయాలి.
News November 12, 2025
26/11 తరహా దాడులకు ప్లాన్?

2008లో ముంబైలో జరిగిన 26/11 తరహా దాడులకు టెర్రరిస్టులు ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. ఎర్రకోట, ఇండియా గేట్, కాన్స్టిట్యూషన్ క్లబ్, గౌరీశంకర్ టెంపుల్ సహా ఢిల్లీలోని ప్రముఖ ప్రాంతాలను టార్గెట్ చేసినట్లు సమాచారం. పలు రైల్వే స్టేషన్లు, షాపింగ్ మాల్స్ కూడా ఈ లిస్టులో ఉన్నట్లు నిఘావర్గాలు తెలిపాయి. రిపబ్లిక్ డే రోజు దాడులకు ప్లాన్ చేశారని, కట్టుదిట్టమైన భద్రత, నిఘా వల్ల ఆ ప్రయత్నం విఫలమైందని చెప్పాయి.


