News November 20, 2024

యమహా RX-100: మళ్లీ వస్తోంది!

image

ఓ తరం మొత్తాన్ని ఆకట్టుకున్న యమహా RX 100 మళ్లీ మార్కెట్లోకి రానుంది. వచ్చే ఏడాది ప్రథమార్ధంలో లాంచ్ కావొచ్చని అంచనా. రూ.1.40లక్షల నుంచి రూ.1.50లక్షల మధ్యలో ధర ఉండొచ్చని మార్కెట్ వర్గాలంటున్నాయి. 100 CC సింగిల్ సిలిండర్ ఇంజిన్, ఫ్యూయల్ ఇంజెక్షన్ టెక్నాలజీ, 5 స్పీడ్ గేర్ బాక్స్, 70 కి.మీ మైలేజీ దీని ప్రత్యేకతలుగా తెలుస్తోంది. డిజైన్‌ విషయంలో పాత స్టైల్‌నే అనుసరించినట్లు సమాచారం.

Similar News

News January 16, 2026

మాడుగుల: రెండు రోజుల తర్వాత మృతదేహం తరలింపు

image

మాడుగుల ప్రాంతానికి చెందిన గిరిజన మహిళ రత్నకుమారి కేజీహెచ్‌లో చి<<18874616>>కిత్స పొందుతూ మృతి చెందగా <<>>అంబులెన్స్ అందించడంలో నిర్లక్ష్యం జరిగింది. దీనిపై వెంటనే స్పందించిన ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ అంబులెన్స్ ఏర్పాటు చేసి రత్నకుమారి మృతదేహాన్ని మాడుగుల సమీపంలోని గిరిజన ప్రాంతానికి తరలించారు. ఆ కుటుంబం అధికారులకు కృతజ్ఞతలు తెలిపారు

News January 16, 2026

ED దాడులు.. బీరువా నిండా రూ.500 నోట్లు

image

ఒడిశాలోని గంజాం జిల్లాలో ఈడీ చేపట్టిన తనిఖీల్లో భారీగా డబ్బు దొరికింది. బొగ్గు, బ్లాక్ స్టోన్ అక్రమ మైనింగ్‌పై విచారణ నేపథ్యంలో 20 ప్రాంతాల్లో ఏకకాలంలో సోదాలు చేపట్టింది. PMLA కింద మాఫియా, వారి వ్యాపార భాగస్వాముల ఇళ్లలో దాడులు చేసింది. ఓ బీరువా నిండా నగదు, లగ్జరీ కార్లు, ఆస్తి పత్రాలను గుర్తించింది. ఆ నగదు విలువ ఎంతో త్వరలో వెల్లడిస్తామని ఈడీ తెలిపింది.

News January 16, 2026

14 వేల పోలీసు ఉద్యోగాలు.. BIG UPDATE

image

TG: రాష్ట్రంలో 2024 నుంచి ఈ ఏడాది జనవరి వరకు 17 వేల మంది కానిస్టేబుల్, ఇతర సిబ్బంది రిటైర్ అయ్యారని అధికారులు నివేదిక ఇచ్చారు. వీరిలో దాదాపు 1100 మంది ఎస్సై, సీఐ, ఇతర సిబ్బంది ఉన్నారు. మొత్తంగా గ్రేటర్ పరిధిలోనే 6 వేల పోస్టులు ఖాళీలు ఉన్నట్లు తెలుస్తోంది. ప్రభుత్వ హామీ మేరకు 14 వేల పోస్టులు భర్తీ చేసేందుకు ప్రభుత్వం, ఆర్థికశాఖకు హోంశాఖ ఫైల్ పంపింది. ఆమోదం రాగానే నోటిఫికేషన్ జారీ అయ్యే అవకాశముంది.