News September 16, 2024

యశస్వీ జైస్వాల్‌ను ఊరిస్తోన్న ఆల్‌టైమ్ రికార్డు

image

టీమ్ ఇండియా యంగ్ ఓపెనర్ యశస్వీ జైస్వాల్‌ను ఓ ఆల్‌టైమ్ రికార్డు ఊరిస్తోంది. టెస్టుల్లో మరో 7 సిక్సర్లు కొడితే ఒక క్యాలెండర్ ఇయర్‌లో అత్యధిక సిక్సర్లు కొట్టిన ఆటగాడిగా ఆయన రికార్డు సృష్టిస్తారు. ఈ ఏడాది జైస్వాల్ మొత్తం 26 సిక్సర్లు బాదారు. అగ్ర స్థానంలో బ్రెండన్ మెక్‌కల్లమ్ (33) ఉన్నారు. బంగ్లాదేశ్‌తో జరగబోయే టెస్ట్ సిరీస్‌లో ఈ రికార్డును అధిగమించేందుకు ఆయన ఎదురు చూస్తున్నారు.

Similar News

News October 22, 2025

రౌడీ చనిపోతే మానవహక్కులు గుర్తుకొస్తాయా?.. VHP ఫైర్

image

TG: NZBలో కానిస్టేబుల్‌ను చంపిన రియాజ్‌ ఎన్‌కౌంటర్‌లో మరణించడంపై మానవ హక్కుల సంఘం కేసు నమోదు చేయడం తెలిసిందే. దీనిపై విశ్వహిందూ పరిషత్ ఫైరైంది. ‘పోలీసులు మరణిస్తే లేని మానవహక్కులు ఓ రౌడీ చనిపోతే గుర్తుకొస్తాయా? నేరస్థులకు మరింత ప్రోత్సాహమిచ్చేలా మాట్లాడటం హంతకులకు ఆయుధాలు ఇవ్వాలని డిమాండ్ చేసినట్లే అవుతుంది’ అని మండిపడింది. జిహాదీ మూకలకు ఇదే రీతిలో జవాబివ్వాలని పోలీసులను కోరింది.

News October 22, 2025

‘బీపీటీ 2846’ వరి రకం ప్రత్యేకత ఏమిటి?

image

ఇది అధిక దిగుబడినిచ్చే మధ్యస్థ సన్నగింజ రకం. కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు ప్రాంతాల్లో బీపీటీ 5204కు ప్రత్యామ్నాయం. ఇది భోజనానికి అనుకూలంగా ఉంటుంది. పంట కాలం 145 నుంచి 150 రోజులు. కాండం దృఢంగా ఉండి చేను పడిపోదు. అగ్గి తెగులు, మెడ విరుపు, పొట్ట కుళ్లు తెగుళ్లను తట్టుకుంటుంది. సగటున ఎకరాకు మూడు టన్నుల దిగుబడి వస్తుంది. సేంద్రియ వ్యవసాయం, నేరుగా విత్తే విధానాలకు BPT 2846 వరి రకం అనుకూలం.

News October 22, 2025

టీఎంసీ విశాఖలో ఉద్యోగాలు

image

టాటా మెమోరియల్ సెంటర్‌(TMC) హోమీ బాబా క్యాన్సర్ హాస్పిటల్ & రీసెర్చ్ సెంటర్ (విశాఖ)‌లో 15 కన్సల్టెంట్ పోస్టులకు దరఖాస్తులు కోరుతోంది. పోస్టును బట్టి సంబంధిత విభాగంలో డిగ్రీ, బీఎస్సీ, ఎంఎస్సీ, ఎంబీఏ, ఎండీ, డీఎన్‌బీ, డీఎంతో పాటు పని అనుభవం ఉన్నవారు నవంబర్ 20 వరకు అప్లై చేసుకోవచ్చు. రాత పరీక్ష, ఇంటర్వ్యూ , స్కిల్ టెస్ట్ ద్వారా ఎంపిక చేస్తారు. వెబ్‌సైట్: https://tmc.gov.in/