News August 8, 2024
యశ్ ‘టాక్సిక్’ షూట్ షురూ

కన్నడ స్టార్ యశ్ హీరోగా నటిస్తున్న ‘టాక్సిక్’ మూవీ షూటింగ్ ప్రారంభమైంది. ఈ విషయాన్ని యశ్ తన సోషల్ మీడియా ఖాతా ద్వారా వెల్లడించారు. లేడీ డైరెక్టర్ గీతూ మోహన్‌దాస్ ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. వెంకట్ కె.నారాయణ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. నయనతార, హ్యూమా ఖురేషీ కీలక పాత్రలు పోషిస్తున్నట్లు తెలుస్తోంది. వచ్చే ఏడాది ఏప్రిల్ 10న విడుదల చేయనున్నట్లు సమాచారం.
Similar News
News February 2, 2026
భారీగా తగ్గిన బంగారం ధరలు

హైదరాబాద్ బులియన్ మార్కెట్లో ఇవాళ బంగారం ధరలు భారీగా తగ్గాయి. 10 గ్రా. 24 క్యారెట్ల గోల్డ్ రేటు రూ.9,050 తగ్గి రూ.1,51,530కు చేరింది. 10 గ్రా. 22 క్యారెట్ల పసిడి రూ.8,300 తగ్గి రూ.1,38,900 పలుకుతోంది.
News February 2, 2026
వేరుశనగలో అంతర పంటలతో లాభాలేంటి?

వర్షాభావ పరిస్థితులు, బెట్ట, కరవు పరిస్థితులు ఏర్పడి ప్రధాన పంట అయిన వేరుశనగ నష్టపోయినా.. అంతర పంటల నుంచి కొంత ఆదాయం పొందే అవకాశం ఉంటుంది. వేరుశనగ, అంతరపంటల వేరువ్యవస్థ పొడవులో తేడాల వల్ల భూమిలోని పోషకాలు, నీటిని పంటలు సమర్థవంతంగా వినియోగించుకునే వీలుంటుంది. చీడపీడల ఉనికి చాలావరకు తగ్గుతుంది. వర్షపునీటిని పొలంలోనే ఇంకేటట్లు చేయడంలో, నేలకోతను నివారించడంలో అంతరపంటలు కీలకపాత్ర పోషిస్తాయి.
News February 2, 2026
ఏ గ్రహానికి ఏ నైవేద్యం సమర్పిస్తే శుభం?

ఆదిత్యుడు – గోధుమలు, రవ్వ చక్కెర పొంగి
చంద్రుడు – పెరుగన్నం
అంగారకుడు – కందిపప్పు అన్నం
బుధుడు – పెసరపప్పు అన్నం
గురు – సెనగపప్పు అన్నం
శుక్రుడు – చిక్కుడు గింజల అన్నం
శని – నల్లని నువ్వులు కలిపిన అన్నం
రాహువు – మినుములతో కూడిన అన్నం
కేతువు – ఉలవల అన్నం


