News August 27, 2024

యశ్వంత్ సిన్హా కొత్త పార్టీ?

image

ఈ ఏడాది చివర్లో ఝార్ఖండ్ ఎన్నికలు జరగనున్న వేళ మరో కొత్త పార్టీకి సన్నాహాలు జరుగుతున్నాయి. దివంగత ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి సిద్ధాంతాలతో కేంద్ర మాజీ మంత్రి యశ్వంత్ సిన్హా అటల్ విచార్ మంచ్(AVM) పేరుతో పార్టీ ఏర్పాటు చేస్తారనే ప్రచారం జరుగుతోంది. తాజాగా ఆయన తన మద్దతుదారులతో సమావేశమై చర్చించారు. మాజీ ఎంపీ జయంత్ సిన్హా, బీజేపీ మాజీ నేత సురేంద్ర కుమార్ ఈ భేటీకి హాజరయ్యారు.

Similar News

News November 4, 2025

ఈ ఒక్క అలవాటు మిమ్మల్ని జీరోని చేస్తుంది!

image

స్మోకింగ్, డ్రింకింగ్ కంటే కూడా పనిని వాయిదా వేసే అలవాటు చాలా డేంజరని లైఫ్‌స్టైల్ కోచ్‌లు హెచ్చరిస్తున్నారు. ‘విద్య, ఉద్యోగం, వ్యాపారం ఇలా ఎందులోనైనా మీరు చేయాలి అనుకున్న/చేయాల్సిన పనిని సకాలంలో పూర్తి చేయాలి. టైముంది కదా తర్వాత చేద్దామన్న థాట్ మీ ప్రొడక్టవిటీని, వర్క్ క్వాలిటీని, అవకాశాలను కిల్ చేస్తుంది. లైఫ్‌లో మిమ్మల్ని జీరోగా నిలబెట్టినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు’ అని హెచ్చరిస్తున్నారు.

News November 4, 2025

Amazon layoffs: ఉదయాన్నే 2 మెసేజ్‌లు పంపి..

image

ఈ కామర్స్ దిగ్గజం అమెజాన్ ఇటీవల ఏకంగా 14 వేల మంది ఉద్యోగులను తొలగించింది. ఉదయాన్నే 2 మెసేజ్‌లు పంపి ఈ విషయం చెప్పినట్లు తెలుస్తోంది. ‘ఆఫీసుకు వెళ్లే ముందు మీ వ్యక్తిగత లేదా ఆఫీసు మెయిల్‌ను చెక్ చేసుకోండి’ అని ఫస్ట్ మెసేజ్‌లో కోరింది. ‘మీ జాబ్ గురించి మెయిల్ రాకపోతే హెల్ప్ డెస్క్ నంబర్‌ను సంప్రదించండి’ అని రెండో దాంట్లో పేర్కొంది. లేఆఫ్ మెయిల్స్ పంపాక ఈ మెసేజ్‌లు ఫార్వర్డ్ చేసినట్లు సమాచారం.

News November 4, 2025

అవసరానికి మించే యూరియా ఇచ్చాం: కేంద్రం

image

ఖరీఫ్‌లో రైతులకు కావాల్సినంత యూరియా, ఫెర్టిలైజర్స్ సరఫరా చేసినట్లు కేంద్ర ఎరువుల శాఖ(DOF) నిర్ధారించింది. 185.39 లక్షల మెట్రిక్ టన్నులు అవసరమని అంచనా వేయగా.. DOF 230.53లక్షల మెట్రిక్ టన్నులు అందుబాటులో ఉంచిందని, 193.20LMT అమ్ముడైనట్లు తెలిపింది. గతేడాది ఖరీఫ్‌తో పోలిస్తే 4.08LMT అధికంగా అమ్ముడైనట్లు పేర్కొంది. పోర్టులు, రైల్వే, రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయంతో ఇది సాధ్యమైందని స్పష్టం చేసింది.