News February 10, 2025

YCPలోకి నగరి MLA సోదరుడు..?

image

నగరి MLA గాలి భానుప్రకాశ్ సోదరుడు జగదీశ్ YCPలో చేరుతారని సమాచారం. ఆయన తండ్రి ముద్దుకృష్ణమ నాయుడు 2019లో మృతిచెందారు. రాజకీయ వారసుడి విషయంలో అప్పట్లో సందిగ్ధం నెలకొంది. దీంతో చంద్రబాబు ముద్దుకృష్ణమ సతీమణి సరస్వతికి MLC ఇచ్చారు. 2019, 24లో భాను ప్రకాశ్‌కు ఎమ్మెల్యే టికెట్ కేటాయించారు. అప్పటి నుంచి జగదీశ్ తటస్థంగా ఉంటూ వచ్చారు. తాజాగా ఈనెల 12న ఫ్యాన్ గూటికి చేరుతారని సమాచారం.

Similar News

News March 12, 2025

పారిశుద్ధ్య నిర్వహణలో పంచాయతీలు పోటీపడాలి: కలెక్టర్

image

పార్వతీపురంలోని టీటీడీ కళ్యాణ మండపంలో సర్పంచులు, పంచాయతీ కార్యదర్శులు, ఈఓపిఆర్డీలకు స్వచ్ఛ సుందర పార్వతీపురం పై శిక్షణా కార్యక్రమం జరిగింది. బుధవారం ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న కలెక్టర్ శ్యాంప్రసాద్ మాట్లాడారు. పారిశుద్ధ్య నిర్వహణలో పంచాయతీలు పోటీపడి తమ పంచాయతీలను నంబర్ వన్‌గా తీర్చిదిద్దాలని పిలుపునిచ్చారు.

News March 12, 2025

గార్ల: బైక్ యాక్సిడెంట్ మహిళకు తీవ్ర గాయాలు

image

గార్ల మండలంలోని పూమ్యా తండా శేరిపురం వెళ్లే రహదారిపై రెండు ద్విచక్ర వాహనాలు బుధవారం ఢీకొన్నాయి. ఒక ద్విచక్ర వాహనంపై మహిళా డ్రైవింగ్ చేస్తుండగా, మరొక వాహనం ఎదురుగా వచ్చి ఢీకొనడంతో మహిళకు తీవ్ర గాయాలు అయినట్లు సమాచారం. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. గాయాలైన వారిని ఆసుపత్రికి తరలించారు. తోటి వాహనదారులు పోలీసులకు సమాచారం అందించారు.

News March 12, 2025

ప్రకాశం జిల్లా మహిళా సమాఖ్య అధ్యక్షురాలిగా కవిత

image

ప్రకాశం జిల్లా మహిళా సమాఖ్య అధ్యక్షురాలిగా టంగుటూరు మండలానికి చెందిన గడ్డం కవిత ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు గ్రామీణ అభివృద్ధి సంస్థ జిల్లా డైరెక్టర్ నారాయణ తెలిపారు. ఒంగోలులోని టీటీడీసీ కార్యాలయంలో బుధవారం జరిగిన జిల్లా సమాఖ్య అధ్యక్షురాలి ఏన్నికల్లో 38 మండలాలకు చెందిన మండల సమాఖ్య అధ్యక్షులు, ఆఫీస్ బేరర్స్ పాల్గొన్నారు. ఈ సందర్బంగా కవిత మాట్లాడుతూ.. ఎన్నికకు కృషి చేసిన వారికి కృతజ్ఞతలు తెలిపారు.

error: Content is protected !!