News December 12, 2024

YCPకి గుడ్ బై చెప్పిన అవంతి శ్రీనివాస్ పయనం ఎటు.!

image

అవంతి శ్రీనివాస్ YCPకి గుడ్ బై చెప్పారు. 2009లో ప్రజారాజ్యం నుంచి పొలిటికల్ ఎంట్రీ ఇచ్చిన ఆయన తొలిసారి MLAగా గెలిచారు. PRP కాంగ్రెస్‌లో విలీనం కావడంతో TDPలో చేరారు. 2014లో MP గెలిచి 19 ఎన్నికల ముందు వైసీపీలో చేరిపోయారు. భీమిలి నుంచి ఎమ్మెల్యేగా గెలిచి జగన్ క్యాబినెట్‌లో మంత్రిగా సేవలందించారు. 2024లో ఓటమితో వైసీపీకి దూరంగా ఉన్న ఆయన తాజాగా రాజీనామా చేశారు. దీంతో ఆయన పయనం ఎటు అనేది చూడాల్సి ఉంది.

Similar News

News December 12, 2024

నా రాజీనామాకు కారణం ఇదే: అవంతి

image

వైసీపీకి తాను రాజీనామా చేసినప్పటికీ వ్యక్తిగతంగా ఎవరినీ విమర్శించనని.. తనని కౌంటర్ చేస్తే తిరిగి కౌంటర్ ఇస్తానని మాజీ మంత్రి అవంతి శ్రీనివాస్ తెలిపారు. ‘ఏ రాజకీయా పార్టీ అయినా ప్రజల అభిప్రాయాలకు అనుగుణంగా నడుచుకోవాలి. అలా జరగకపోవడంతోనే ఓడిపోయాం. ఫలితాల తర్వాత కూడా వైసీపీలో తీరు మారలేదు. అందుకే రాజీనామా చేస్తున్నా. ప్రస్తుతం కూటమి పాలన బాగుంది’ అని అవంతి చెప్పారు.

News December 12, 2024

వైభవంగా సింహాద్రి అప్పన్న తిరువీధి ఉత్సవం

image

ఏకాదశి పురస్కరించుకొని సింహాచలం సింహాద్రి అప్పన్న తిరువీధి ఉత్సవాన్ని బుధవారం సాయంత్రం వైభవంగా నిర్వహించారు. శ్రీదేవి భూదేవి సమేతంగా గోవిందరాజు స్వామిని అలంకరించి వాహనంలో అధిష్టింప చేసి విశేష పూజలు నిర్వహించారు. అనంతరం మంగళ వాయిద్యాలు, వేదమంత్రాల మధ్య మాడవీధుల్లో ఊరేగించారు. భక్తులు పలువురు స్వామిని దర్శించుకున్నారు.

News December 12, 2024

ఉమ్మడి విశాఖ జిల్లా అధికారులతో సీఎం చంద్రబాబు డిన్నర్

image

రెండో విడ‌త జిల్లా కలెక్టర్ల కాన్ఫ‌రెన్స్‌లో భాగంగా బుధవారం వెల‌గ‌పూడి స‌చివాల‌యంలోని ఉమ్మడి విశాఖ జిల్లా అధికారులు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన స‌మావేశమాయ్యారు. కలెక్టర్ల సదస్సు అనంతరం ఉమ్మడి విశాఖ జిల్లా కలెక్టర్లు, పోలీస్ కమీషనర్, ఎస్‌పీలు, ఇతర అధికారులతో కలిసి సీఎం చంద్రబాబు నాయుడు డిన్నర్ చేశారు. కార్యక్రమంలో హోంమంత్రి అనిత ఉన్నారు.