News July 23, 2024
YCPకి మద్దాలి గిరి రాజీనామా.. కారణమేంటి.?

గుంటూరు పశ్చిమ మాజీ ఎమ్మెల్యే మద్దాలి గిరి YCPకి సోమవారం రాజీనామా చేసిన విషయం తెలిసిందే. దీనికి గల కారణంపై రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చ జరుగుతోంది. 2019లో TDP నుంచి YCPలో చేరిన ఆయనకు 2024 ఎన్నికల్లో టికెట్ దక్కలేదు. అదే సమయంలో గిరికి పార్టీ నగర అధ్యక్ష బాధ్యతల్ని అప్పగించినా, ఆయన పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా లేరని సమాచారం. త్వరలో రాజకీయ భవిష్యత్తుపై ఆయన నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్లు సమాచారం.
Similar News
News September 15, 2025
ANU: ఏపీ పీజీ సెట్ షెడ్యూల్ మార్పు

రాష్ట్ర ఉన్నత విద్యా మండలి ఆధ్వర్యంలో నిర్వహించే ఏపీ పీజీ సెట్ – 2025 షెడ్యూల్లో మార్పులు జరిగాయని కన్వీనర్ ప్రొఫెసర్ రవికుమార్ తెలిపారు. వెబ్ కౌన్సిలింగ్ రిజిస్ట్రేషన్ ప్రక్రియను ఈ నెల 17 వరకు, ఆన్లైన్ సర్టిఫికెట్ ధ్రువీకరణను 18 వరకు పొడిగించినట్లు ఆయన చెప్పారు. వెబ్ ఆప్షన్స్ ప్రక్రియ ఈ నెల 20 వరకు జరుగుతుందని పేర్కొన్నారు.
News September 15, 2025
కలెక్టరేట్లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు: జేసీ అశుతోష్ శ్రీవాస్తవ

గుంటూరు జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో అన్నీ శాఖల అధికారులు అప్రమత్తంగా ఉండాలని జాయింట్ కలెక్టర్ అశుతోష్ శ్రీవాస్తవ ఆదేశించారు. వర్షాల నేపథ్యంలో జిల్లా కలెక్టరేట్ లో కంట్రోల్ రూమ్ – 0863 2234014 ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. శిథిలావస్థలో ఉన్న భవనాలు, చెట్ల కింద ఎవరూ ఉండొద్దని సూచించారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు.
News September 15, 2025
గుంటూరు: DSC-2025 రిక్రూట్మెంట్ జాబితా చెక్ చేస్కోండి

గుంటూరు జిల్లాలో మెగా డీఎస్సీ-2025 కి సంబంధించిన అన్ని కేటగిరీల రిక్రూట్మెంట్ జాబితాను deognt.blogspot.com వెబ్సైట్లో ఉంచినట్లు డీఈవో సి.వి. రేణుక తెలిపారు. ఈ జాబితాను డీఈవో కార్యాలయం, కలెక్టరేట్లోని డిస్ప్లే బోర్డుల్లో కూడా ప్రదర్శిస్తామని ఆమె చెప్పారు. అదనపు సమాచారం కోసం డీఈవో కార్యాలయంలోని సహాయక కేంద్రాన్ని సంప్రదించాలని ఆమె సూచించారు.