News November 7, 2024

YCP అధినేత జగన్‌తో కాకాణి భేటీ

image

YCP అధినేత వై.ఎస్.జగన్మోహన్ రెడ్డిని తాడేపల్లిలో మాజీ మంత్రి, ఉమ్మడి నెల్లూరు జిల్లా YCP అధ్యక్షుడు డాక్టర్ కాకాణి గోవర్ధన్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. ఇందులో భాగంగా వారు జిల్లాలోని పార్టీ స్థితిగతులపై సుదీర్ఘంగా చర్చించారు. పార్టీ కార్యకర్తలకు ఎప్పుడూ అండగా ఉండాలని జగన్ స్పష్టం చేశారు. పార్టీ బలోపేతానికి కృషి చేయాలని జగన్ సూచించినట్లు కాకాణి తెలిపారు.

Similar News

News November 22, 2025

మార్చి 16 నుంచి 10వ తరగతి పరీక్షలు: డీఈవో

image

వచ్చే ఏడాది మార్చి 16వ తేదీ నుంచి పదవ తరగతి పరీక్షలు నిర్వహించనున్నట్లు జిల్లా విద్యాశాఖ అధికారి డాక్టర్ ఆర్ బాలాజీ రావు ఒక ప్రకటనలో తెలిపారు. పరీక్షలో ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12. 45 గంటల వరకు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. జిల్లాలోని ఉపాధ్యాయులు ఈ విషయాన్ని గమనించి 10వ తరగతి ఫలితాల్లో 100% ఉత్తీర్ణత వచ్చేలా కృషి చేయాలని కోరారు.

News November 22, 2025

నెల్లూరు: డిజిటల్ అరెస్ట్ పేరుతో రూ.23 లక్షల స్వాహా

image

నెల్లూరు రూరల్‌లోని శాస్త్రవేత్తకు సైబర్ నేరగాళ్ల సెగ తగిలింది. CBI పేరుతో డిజిటల్ అరెస్టుకు పాల్పడి అతని వద్ద నుంచి రూ.23 లక్షలు స్వాహా చేశారు. మహిళలకు అసభ్యకరమైన ఫొటోలు పంపించినందుకు తాము అరెస్టు చేస్తున్నట్లు బెంగళూరు నుంచి CBI అధికారుల పేరుతో కాల్ చేసి భయపెట్టారు. బాధితుడు రూ.23 లక్షలు చెల్లించి మోసపోవడంతో వేదాయపాళెం పోలీసులకు ఫిర్యాదు చేయగా..వారు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

News November 22, 2025

నెల్లూరు: భార్య.. భర్త.. ఓ ప్రియురాలు

image

వివాహితుడు ఆత్మహత్యకు యత్నించిన ఘటన కలిగిరిలో జరిగింది. ఏపినాపి గ్రామానికి చెందిన విష్ణువర్ధన్‌కు సరితతో ఎనిమిదేళ్ల క్రితం వివాహమైంది. కాగా ఇటుకబట్టీల వద్ద పనిచేసే క్రమంలో ధనలక్ష్మితో పరిచయమై వివాహేతర సంబంధం ఏర్పడింది. ఈక్రమంలో వీరు ప్రకాశం(D) పామూరులో ఉన్నారని తెలియడంతో సరిత తన భర్తను కలిగిరికి తీసుకొచ్చింది. ప్రియురాలిని దూరం చేశారంటూ విష్ణువర్ధన్ ఆత్మహత్యకు యత్నించగా భార్య ఆసుపత్రిలో చేర్చింది.