News June 6, 2024
YCP కోనసీమ జిల్లా ఉపాధ్యక్షుడి రాజీనామా

ఉమ్మడి తూ.గో జిల్లాలో కూటమి విజయకేతనం ఎగురవేయడంతో పలువురు వైసీపీ నేతలు, కార్పొరేషన్ల ఛైర్మన్లు వారి పదవులకు రాజీనామా చేస్తున్నారు. డా.అంబేడ్కర్ కోనసీమ జిల్లా వైసీపీ ఉపాధ్యక్ష పదవికి అమలాపురం రూరల్ మండలం బండారులంక గ్రామానికి చెందిన వూటుకూరి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి రాజీనామా చేసినట్లు గురువారం ప్రకటించారు. రాజీనామా పత్రాన్ని జగన్మోహన్ రెడ్డికి పంపించినట్లు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి తెలిపారు.
Similar News
News December 3, 2025
రాజమండ్రి కమిషనర్‌కు చంద్రబాబు అభినందన

కేంద్ర ప్రభుత్వం నుంచి ‘జల్ సంచాయ్-జన్ భాగీధారి’ అవార్డును అందుకున్న రాజమండ్రి మున్సిపల్ కమిషనర్ రాహుల్ మీనాను ముఖ్యమంత్రి చంద్రబాబు అభినందించారు. బుధవారం తూర్పుగోదావరి జిల్లా నల్లజర్ల పర్యటనకు వచ్చిన ఆయన అవార్డును చూసి కమిషనర్‌ను ప్రత్యేకంగా అభినందించారు. కష్టపడి పనిచేస్తే ఇలాంటి అవార్డులు మరెన్నో వస్తాయని ఆయన అన్నారు. సమిష్టి కృషివల్లే ఇలాంటి అవార్డులు సాధ్యమవుతాయన్నారు.
News December 3, 2025
రాజమండ్రి: నిర్మలా సీతారామన్‌కు MP పురంధేశ్వరి రిక్వెస్ట్!

కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మల సీతారామన్‌తో రాజమండ్రి ఎంపీ దగ్గుబాటి పురంధేశ్వరి బుధవారం భేటీ అయ్యారు. పొగాకు బోర్డులో మానవ వనరుల పునర్వ్యవస్థీకరణ, పొగాకుపై GST, పంటకు సంబంధించిన పలు విషయాలను ఆమె వివరించారు. టొబాకో బోర్డు ఛైర్మన్ చిడిపోతు యశ్వంత్ కూడా పలు సమస్యలను కేంద్ర మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. దీంతో ఆమె సానుకూలంగా స్పందించి త్వరలోనే పరిష్కారానికి హామీ ఇచ్చారని పురంధేశ్వరి పేర్కొన్నారు.
News December 3, 2025
‘ఆయుష్మాన్ భారత్’ పరిధిని విస్తరించాలి: MP పురందేశ్వరి

ఆయుష్మాన్ భారత్ పరిధిని విస్తరించాలని రాజమండ్రి MP దగ్గుబాటి పురందేశ్వరి కోరారు. ఈరోజు ఆమె పార్లమెంట్లో ముఖ్యమైన అంశం కింద ఈ అంశాన్ని ప్రస్తావించారు. దీర్ఘకాలిక, సాధారణ వ్యాధుల కోసం అవసరమైన ఓపీడీ సేవలను పథకం పరిధిలో తక్షణమే చేర్చాలని, ఆసుపత్రి అనంతరం ఔషధాల కవరేజిని 15 రోజుల పరిమితిని విస్తరించి లబ్ధిదారులపై పడుతున్న అదనపు ఖర్చులను గణనీయంగా తగ్గించాలని ఆమె కోరారు.


