News June 14, 2024

YCP నాయకుడి గెస్ట్‌హౌస్‌కు పైపులైన్‌ తొలగించండి: గ్రామస్థులు

image

గాండ్లపెంట మండలం కల్లుబావి తండాకు సమీపంలలో YCP నాయకుడు రామాంజులు గెస్ట్‌హౌస్‌ నిర్మించుకొని పంచాయతీ బోరు నుంచి పైపులైన్‌ వేసుకున్నాడని, దీంతో గ్రామంలో తాగునీటి సమస్య ఏర్పడిందని గ్రామస్థులు ఆరోపించారు. ఆ పైపులైన్‌ను తొలగించాలని కోరుతూ గురువారం ఎంపీడీవో కార్యాలయంలో వినతిపత్రం అందజేశారు. పంచాయతీ బోరు నుంచి ఎంపీటీసీ నిధులతో గెస్ట్‌హౌస్‌కు పైపులైన్‌ వేసుకొని తోటకు నీరు వాడుకుంటున్నట్లు తెలిపారు.

Similar News

News September 16, 2024

ప్లేయర్లకు శుభవార్త.. అనంతపురంలో క్రికెట్ అకాడమీ!

image

ప్రతిష్ఠాత్మక దులీప్ ట్రోఫీకి వేదికైన అనంతపురంలో ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ అకాడమీ (ACA) ఏర్పాటయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఏసీఏ కార్యకర్గ సమావేశంలో ఈ విషయమై చర్చ జరిగినట్లు తెలుస్తోంది. కడపలోని అకాడమీని అనంతపురానికి తరలిస్తే ఎలా ఉంటుందన్న అంశంపై సభ్యులు చర్చించినట్లు సమాచారం. త్వరలోనే దీనిపై క్లారిటీ రానుంది. ఇక్కడ అకాడమీ ఏర్పాటైతే ప్రతిభ ఉన్న క్రికెటర్లకు నాణ్యమైన ట్రైనింగ్ ఫ్రీగా లభిస్తుంది.

News September 16, 2024

అనంతపురంలో క్రికెటర్ల ఫుడ్ మెనూ ఇదే!

image

అనంతపురంలో ఉంటున్న భారత క్రికెటర్లు ఆంధ్రా ఇడ్లీ రుచి చూస్తున్నారు. టమాటా బాత్, సాంబార్ ఇడ్లీని ఇష్టంగా తింటున్నారట. కోడిగుడ్డు, బ్రెడ్ ఆమ్లేట్, మొలకెత్తిన పెసలు, శనగలు వంటివి అల్పాహారంలో తీసుకుంటున్నారు. మధ్యాహ్నం, రాత్రి మూడు రకాల చికెన్ వంటకాలను మెనూలో ఉంచగా క్రికెటర్లను మటన్ బిర్యానీకి దూరంగా ఉంచారు. ప్లేయర్లు ఉదయం 8లోపే టిఫెన్ చేసి గ్రౌండ్‌కు వెళ్తున్నట్లు బీసీసీఐ ప్రతినిధులు తెలిపారు.

News September 16, 2024

అనంతపురంలో కిలో టమాటా రూ.33

image

అనంతపురం జిల్లాలో టమాటా కిలో రూ.33 పలుకుతున్నట్లు మార్కెట్ యార్డ్ కార్యదర్శి రాంప్రసాద్ పేర్కొన్నారు. జిల్లా కేంద్రానికి సమీపంలోని కక్కలపల్లి టమాటా మార్కెట్లో గరిష్ఠంగా రూ.33తో క్రయవిక్రయాలు జరుగుతున్నాయన్నారు. దాదాపు 2,250 టన్నుల టమాటా దిగుబడులు వచ్చాయని తెలిపారు. ఇక కిలో సరాసరి ధర రూ.25, కనిష్ఠ ధర రూ.17గా ఉందని వివరించారు.