News June 7, 2024

YCP మాజీ MLA ఆర్కే స్వగ్రామంలో TDPకి మెజారిటీ

image

రాజ్యసభ సభ్యుడు ఆళ్ల అయోధ్య రామిరెడ్డి, మాజీ MLA ఆర్కే స్వగ్రామం పెదకాకానిలో TDPకి మెజారిటీ వచ్చింది. ఆళ్ల కుటుంబం ఓటు వేసిన పోలింగ్ కేంద్రం 32లో కూడా ధూళిపాళ్ల నరేంద్ర 201 ఓట్ల ఆధిక్యం సాధించారు. పొన్నూరు పరిశీలకుడిగా RK వ్యవహరించినా టీడీపీకి 32,915 ఓట్ల మెజారిటీ దక్కిందని TDP నేతలు చెబుతున్నారు. 2019లో పెదకాకాని మండలంలో YCPకి 1650 మెజారిటీ రాగా, నేడు టీడీపీకి 10వేలకు పైగా మెజారిటీ వచ్చిందన్నారు.

Similar News

News November 21, 2025

గుంటూరులోని ఈ బాలుడు మీకు తెలుసా?

image

గుంటూరు రైల్వేస్టేషన్ తూర్పు గేటు పార్కింగ్ వద్ద నవంబర్ 18న ఉదయం 8 గంటలకు మూడేళ్ల బాలుడు ఏడుస్తూ ఒంటరిగా దొరికాడు. తల్లిదండ్రుల ఆచూకీ లభించకపోవడంతో ఆర్‌పీఎఫ్, చైల్డ్ వెల్ఫేర్ అధికారులు బాలుడిని కొత్తపేట పోలీసుల ద్వారా శిశు సంరక్షణ కేంద్రానికి తరలించారు. బాలుడు తన వివరాలు చెప్పలేకపోతున్నాడు. బాలుడి ఆచూకీ తెలిసిన వారు తనను 8688831320 నంబర్‌లో సంప్రదించాలని కొత్తపేట సీఐ కోరారు.

News November 21, 2025

గుంటూరు: డిసెంబర్ 13న జాతీయ లోక్ అదాలత్

image

గుంటూరు జిల్లా వ్యాప్తంగా DEC 13న జాతీయ లోక్ అదాలత్ నిర్వహించనున్నారు. సివిల్, రాజీ పడదగ్గ క్రిమినల్, ఎక్సైజ్, మోటార్ ప్రమాద బీమా, చెక్ బౌన్స్, LAOP, ప్రీ-లిటిగేషన్ కేసులపై ప్రత్యేక బెంచీలు ఏర్పాటు చేయనున్నట్లు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఛైర్మన్, జిల్లా ప్రధాన న్యాయమూర్తి సాయికళ్యాణ్ చక్రవర్తి తెలిపారు. కక్షిదారులు, పోలీసులు, స్టేక్‌హోల్డర్లు ఎక్కువ కేసులు రాజీ చేసుకునేందుకు సహకరించాలన్నారు.