News October 9, 2025

YCP హయాంలో ఉత్తరాంధ్రకు 4 మెడికల్ కాలేజీలు: జగన్

image

మాజీ సీఎం జగన్ నర్సీపట్నం మెడికల్ కాలేజీ ముందు మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఆయన మాట్లాడుతూ.. 2019 వరకు ఉత్తరాంధ్రలో బ్రిటీష్ హయాంలో కట్టిన KGH, YSR హయాంలో తీసుకొచ్చిన రిమ్స్ మాత్రమే ఉండేవన్నారు. తాము అధికారంలోకి వచ్చిన తర్వాత ఉత్తరాంధ్రలో సుమారు 4 కాలేజీల ఏర్పాటుకు చర్యలు చేపట్టామన్నారు. ఇప్పటికే విజయనగరం, పాడేరు కాలేజీల్లో క్లాసులు కూడా స్టార్ట్ అయ్యాయన్నారు.

Similar News

News October 10, 2025

నాగర్‌కర్నూల్: హాస్టల్‌లో సమస్యలను పరిష్కరించాలి: ఎస్ఎఫ్ఐ

image

నాగర్‌కర్నూల్ పట్టణంలోని ప్రభుత్వ సంక్షేమ హాస్టల్‌లో ఎస్ఎఫ్ఐ విద్యార్థి సంఘం నాయకులు గురువారం సమస్యలపై విద్యార్థులతో సమావేశం నిర్వహించారు. ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి తారాసింగ్ మాట్లాడుతూ.. ప్రభుత్వ సంక్షేమ హాస్టళ్లలో చదువుతున్న విద్యార్థులు అనేక సమస్యలతో ఇబ్బంది పడుతున్నారన్నారు. విద్యా సంవత్సరం ప్రారంభమై నాలుగు నెలలు గడిచినా ఇప్పటికీ విద్యార్థులకు దుప్పట్లు లేవని అన్నారు.

News October 10, 2025

నాగర్‌కర్నూల్: ‘చేగువేరా స్ఫూర్తితో యువత ఉద్యమించాలి’

image

నాగర్‌కర్నూల్ జిల్లా కేంద్రంలోని అంబేడ్కర్ చౌరస్తాలో గురువారం డీవైఎఫ్ఐ ఆధ్వర్యంలో విప్లవ వీరుడు చేగువేరా 58వ వర్ధంతిని నిర్వహించారు. ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా డీవైఎఫ్ఐ మాజీ అధ్యక్షుడు ఆర్.శ్రీనివాస్ మాట్లాడుతూ.. చేగువేరా స్ఫూర్తితో సమాజంలోని అసమానతలపై యువత ఉద్యమించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో చంద్రమౌళి, సుల్తాన్, కృష్ణయ్య, వెంకటేశ్ తదితరులు పాల్గొన్నారు.

News October 10, 2025

ఆదర్శ గ్రామ యోజన’ పనులు త్వరితగతిన పూర్తి: కలెక్టర్

image

జిల్లాలో ప్రధానమంత్రి ఆదర్శ గ్రామ యోజన కింద ఎంపిక చేసిన 81 గ్రామాలలో అభివృద్ధి కార్యక్రమాలను నిర్దేశించిన సమయంలోగా పూర్తి చేస్తామని జిల్లా కలెక్టర్ వెట్రిసెల్వి తెలిపారు. గురువారం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్‌తో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో ఆమె ఈ విషయాన్ని వెల్లడించారు. పనులను త్వరితగతిన పూర్తి చేస్తామన్నారు.