News March 26, 2024
అర్చకులపై వైసీపీ దాడి దుర్మార్గం: లోకేశ్

AP: రాష్ట్రంలో వైసీపీ మూకల అరాచకానికి హద్దు లేకుండా పోతోందని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్ Xలో విమర్శించారు. పూజ సరిగా చేయలేదంటూ కాకినాడలోని ఓ గుడిలో పూజారులపై వైసీపీ నేత దాడి చేశారని ఆరోపించారు. నిందితుడిని వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. వైసీపీ నేతలు ఆటవిక చర్యలతో ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తూ రాక్షసానందం పొందుతున్నారని మండిపడ్డారు.
Similar News
News February 3, 2026
లండన్‌లో మంత్రి నారాయణ పర్యటన

AP: అమరావతి నిర్మాణంలో భాగంగా పలు ప్రాజెక్టుల అధ్యయనం కోసం యూకేలో మంత్రి నారాయణ బృందం పర్యటన కొనసాగుతోంది. అమరావతిలో అమలు చేయగలిగే ఆధునిక పట్టణ ప్రణాళిక, స్పోర్ట్స్ సిటీ, రివర్ ఫ్రంట్ డెవలప్‌మెంట్ వంటి అంశాలపై ఈ బృందం అధ్యయనం చేస్తోంది. లండన్ కార్పొరేషన్ ప్లానింగ్ డైరెక్టర్ గ్విన్ రిచర్డ్స్‌తో మంత్రి సమావేశమయ్యారు. లండన్ మాస్టర్ ప్లాన్, రవాణా, అభివృద్ధి ప్రణాళికల గురించి అడిగి తెలుసుకున్నారు.
News February 3, 2026
ఇంట్లో అదనపు దేవుడి విగ్రహాలు ఉంటే..?

ఇంట్లో అదనంగా ఉన్న దేవుడి విగ్రహాలు/ఫోటోలను పొరపాటున కూడా ఎక్కడ పడితే అక్కడ పారవేయకూడదు. దీనివల్ల దరిద్రం చుట్టుముట్టే ప్రమాదం ఉందని పండితులు చెబుతున్నారు. వాటిని భద్రంగా చూసుకోగలిగే వ్యక్తులకు ఇవ్వాలని సూచిస్తున్నారు. లేకపోతే సమీపంలోని ఆలయాలకు అప్పగించాలని అంటున్నారు. అది కూడా కుదరకపోతే పారే నదిలో వాటిని నిమజ్జనం చేయవచ్చని శాస్త్రాలు చెబుతున్నాయి.
News February 3, 2026
USతో అణు చర్చలకు సిద్ధమవుతున్న ఇరాన్

USతో అణు చర్చలకు ఇరాన్ సిద్ధమవుతోంది. ఇరాన్ ప్రెసిడెంట్ మసౌద్ పెజెష్కియాన్ USతో చర్చలకు ఆదేశాలు ఇచ్చినట్లు ఫార్స్ వార్తా సంస్థను ఉటంకిస్తూ AFP పేర్కొంది. ఏ తేదీన ఇవి జరుగుతాయో చెప్పలేదు. కాగా US ఇరాన్‌పై దాడిచేస్తే అది ప్రాంతీయ యుద్ధంగా మారుతుందని ఇరాన్ ‘సుప్రీం’ ఖమేనీ నిన్న హెచ్చరించారు. దీనిపై స్పందిస్తూ ఒప్పందం కుదురుతుందని ఆశిస్తున్నట్లు ట్రంప్ పేర్కొనడంతో తాజా పరిణామాలు చోటుచేసుకున్నాయి.


