News October 7, 2025

కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైసీపీ సంతకాల సేకరణ

image

AP: మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణపై అక్టోబర్ 10 నుంచి ప్రజా ఉద్యమం చేయనున్నట్లు YCP చీఫ్ వైఎస్ జగన్ వెల్లడించారు. దీనిపై కార్యాచరణ ప్రకటించారు. కోటి సంతకాల సేకరణకు ఈనెల 10 నుంచి 22 వరకు గ్రామ, వార్డు స్థాయిల్లో రచ్చబండ, 28న నియోజకవర్గ, నవంబర్ 12న జిల్లా కేంద్రాల్లో ర్యాలీలు, సంతకాల పత్రాలు NOV 23న జిల్లా కేంద్రాలకు, 24న విజయవాడకు చేర్చాలని తెలిపారు. తర్వాత వాటిని గవర్నర్‌కు సమర్పిస్తామని చెప్పారు.

Similar News

News October 8, 2025

నేటి ముఖ్యాంశాలు

image

* సమర్థుడికే టీటీడీపీ అధ్యక్ష బాధ్యతలు: CBN
* బీసీ రిజర్వేషన్లపై సీనియర్ నేతలతో సీఎం రేవంత్ సుదీర్ఘ చర్చ
* గ్రూప్‌-1పై హైకోర్టు ఆదేశాలపై స్టేకు సుప్రీం నిరాకరణ
* కల్తీ మద్యం వెనుక ఉన్నదంతా బాబు అండ్ గ్యాంగే: జగన్
* జగన్ రోడ్ షోకు అనుమతి నిరాకరణ
* పొన్నం, అడ్లూరి వివాదం.. మాట్లాడి పరిష్కరిస్తానన్న TPCC చీఫ్

News October 8, 2025

రేపే తీర్పు.. సర్వత్రా ఉత్కంఠ

image

TGలో స్థానిక సంస్థల ఎన్నికలపై ఉత్కంఠకు రేపు తెర పడనుంది. ప్రభుత్వం బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించడాన్ని వ్యతిరేకిస్తూ దాఖలైన పిటిషన్‌పై హైకోర్టులో విచారణ జరగనుంది. పిటిషనర్ వాదనను సమర్థిస్తూ న్యాయస్థానం తీర్పిస్తే రిజర్వేషన్ల అమలు నిలిచిపోయే అవకాశం ఉంది. అదే జరిగితే పార్టీ తరఫున ఈ హామీని నెరవేరుస్తూ ఎన్నికలకు వెళ్లాలని సీఎం రేవంత్ రెడ్డి యోచిస్తున్నారు. మరి కోర్టు తీర్పు ఎలా వస్తుందో చూడాలి.

News October 8, 2025

మోహన్‌బాబు యూనివర్సిటీకి భారీ జరిమానా

image

AP: సినీ నటుడు మోహన్‌బాబుకు ఉన్నత విద్యా కమిషన్ షాకిచ్చింది. తిరుపతిలోని మోహన్‌బాబు యూనివర్సిటీలో మూడేళ్లుగా విద్యార్థుల నుంచి అదనంగా రూ.26 కోట్లు వసూలు చేసినట్లు వెల్లడించింది. 15 రోజుల్లోగా ఆ మొత్తాన్ని తిరిగి చెల్లించాలని ఆదేశించింది. విచారణ అనంతరం రూ.15 లక్షల జరిమానా విధించింది. యూనివర్సిటీ లైసెన్స్ రద్దు చేయాలని ప్రభుత్వానికి కమిషన్ సిఫారసు చేసింది.